కృష్ణ

నేరాల ఛేదనలో జిల్లా పోలీసులకు అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మే 16: రాష్ట్రంలో ప్రతి నెలలో అత్యంత ప్రతిభ కనపర్చి తమదైన ముద్రవేసిన అధికారులకు నేరాల ఛేదనకు గాను ఇచ్చే అవార్డుల్లో ఈసారి జిల్లా పోలీసులకు అవార్డుల పంట పండింది. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లలోని సిబ్బంది చూపించిన ప్రతిభకు గాను పోలీసు అధికారులకు ఎబీసీడీ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డులను డీజీపీ మాలకొండయ్య ప్రదానం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, నందిగామ, ముసునూరు, చాట్రాయి, రెడ్డిగూడెం స్టేషన్‌ల సిబ్బందికి డీజీపీ మాలకొండయ్య అందజేశారు. మన రాష్ట్రంలోని గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లా, తెలంగాణ ప్రాంతాలలో ఎవరూ కాపాలా ఉండరని గ్రహించి వాటిని ఎంపిక చేసుకున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ప్రభుత్వం కేటాయించిన కంప్యూటర్లు, ప్రింటర్లు, మోనిటర్లు, మైక్‌సెట్స్, ప్రొజెక్టర్లు, ఇన్‌వర్టర్లు, బ్యాటరీస్ ఇతర వస్తువులను దొంగిలిస్తున్న తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని కల్లూరు గ్రామానికి చెందిన షేక్ అక్బర్, షేక్ మోహబూబ్ మియా, సాయిరామ్‌లు మొత్తం 70 నేరాలు చేసి పోలీసులు కళ్లు కప్పి తిరుగుతున్న వారిని కంచికచర్ల పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ.25లక్షల ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన నందిగామ రూరల్ సీఐ ఏ నవీన్ నరసింహ మూర్తి, కంచికచర్ల ఎస్సై డీ సందీప్, కంచికచర్ల కానిస్టేబుల్ యూ రాము, వీరులపాడు కానిస్టేబుల్ ఇనైతుల్లాకు ఈ అవార్డులను డీజీపీ మాలకొండయ్య అందజేశారు. ఇంతటి అత్యంత ప్రతిభ కనపర్చి నేరస్థులను అదుపులోకి తీసుకుని ప్రభుత్వానికి చెందిన అస్తులకు సర్వదా రక్షణ కల్పిస్తామని హామీ కల్పిస్తామని డీజీపీ మాలకొండయ్య తెలిపారు. పోలీసు సిబ్బంది శక్తి వంచన లేకుండా, అత్యంత బాధ్యతాయుతంగా విధులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అవార్డులు తీసుకున్న పోలీసు అధికారులకు జిల్లా సూపరింటెండంట్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

జి ప్లస్ 3 హౌసింగ్ నిర్మాణాలపై ఎమ్మెల్యే సమీక్ష
* పవర్ గ్రిడ్ అధికారులు సరైన నష్ట పరిహారం చెల్లించాలి
నందిగామ, మే 16: జి ప్లస్ 3 గృహ నిర్మాణాలపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. గృహ నిర్మాణ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో జాయింట్ కలెక్టర్ 2 బాబూరావు, పవర్ గ్రిడ్ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల రైతులు తమకు నష్టపరిహారం చెల్లించకుండానే తమ వ్యవసాయ భూముల్లో పవర్ గ్రిడ్ అధికారులు దౌర్జన్యంగా ప్రవేశించి టవర్లు నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కల్గించకుండా వారికి నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దీనిపై పవర్ గ్రిడ్ అధికారులు తగిన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకట రమణ, కౌన్సిలర్ మనబోతుల శ్రీరామ, నాయకులు శాఖమూరు వంశీధర్, ఇంటూరి సీ తయ్య, అమ్మినేని జ్వాలా ప్రసాద్, షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. తొ లుత ఎమ్మెల్యే తన కార్యాలయంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులతో చర్చించారు. 279 జివో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అని, దానిపై పూర్తి వివరాలు తీసుకుని తగు చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని, సమ్మె విరమించి విధుల్లో పాల్గొనాలని సూచించారు.