కృష్ణ

పెడన అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిని నేనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, జూన్ 12: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెడన అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాంప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం వైసీపీ నాయకుడు చిటికినేని సూర్య నాగమల్లేశ్వరరావు (అబ్బులు) నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థిత్వంపై కార్యకర్తలు గందరగోళానికి గురి కావల్సిన అవసరం లేదన్నారు. తన అభ్యర్ధిత్వంపై ఇటీవల కాలంగా దుష్ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ అధినేత జగన్ ఏడు సంవత్సరాల నుండి పని చేసిన తన వైపే మొగ్గు చూపుతారన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు పెడన మున్సిపాల్టీలోనూ బూత్ స్థాయి నుండి గ్రామ, మండల స్థాయి వరకు పార్టీ కమిటీలు వేయటంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. జగన్ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
జి.కొండూరు, జూన్ 12: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. చేగిరెడ్డిపాడు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఈప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన తేజావత్ బ్రహ్మాజి (22) కందులపాడు మీదుగా గణపవరం గ్రామానికి తన పల్సర్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ముందుగా వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న బ్రహ్మాజి తన ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక వెనుక నుంచి వేగంగా టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే బ్రహ్మాజీ మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ డి.రాజేష్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలి
బంటుమిల్లి, జూన్ 12: నేటి బాలలే భావి భారత పౌరులని బంటుమిల్లి మెజిస్ట్రేట్ ఎస్ విజయచందర్ అన్నారు. మండల పరిధిలోని నాగేశ్వరరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ప్రపంచ బాల కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాల కార్మికులచే పని చేయించుకోవటం చట్టరిత్యా నేరమన్నారు. ఏవరైనా, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వారికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యనందించాలన్నారు. అనాధ పిల్లలను సమాజంలో వదిలి వేయకుండా అనాధాశ్రమంలో చేర్పించాలన్నారు. బాల్య వివాహాలు, ఉచిత నిర్బంధ విద్య చట్టాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పలువురు పాల్గొన్నారు.