కృష్ణ

వెల్లటూరులో అధ్వాన్న రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, జూలై 12: వెల్లటూరులో రహదారులు అధ్వాన్నంగా మారాయి. రోజుల తరబడి నిలిచిన వర్షపునీరు ప్రజాజీవితాలను స్తంభింపచేస్తున్నాయి. వెల్లటూరులో 7వ వార్డు, 8వ వార్డులో గత 10 రోజుల నుంచి నీళ్ళు నిలవ ఉంటున్నాయి. మురుగుకాల్వలు లేక ఎప్పటినుంచో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సిమెంటు రహదారి మంజూరై శంకస్థాపన జరిగినప్పటికీ టీడీపీ, వైసీపీ వాళ్ళు రహదారి నిర్మాణానికి పోటీ పడిన కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇదేనా నాయకులు వ్యవహరించే తీరు అని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్కడే ఉన్న సిఎస్‌ఐ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని మురుగునీరు చుట్టుముట్టాయి. దీంతో పాఠశాలలకు విద్యార్ధులు రావడం మానేశారు. నిల్వ ఉన్న నీటితో దోమలు విపరీతంగా పెరిగి యాయి. దుర్వాసన భరించ లేక ప్రజలు ఇళ్ళను ఖాళీ చేసి పగలు బయట తిరుగుతూ, రాత్రి సమయంలో సిఎస్‌ఐ చర్చిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వీధుల్లో నడిచే అవకాశం లేని కారణంగా గోడలు దూకి ప్రధాన రహదారుల్లోకి రావాల్సి వస్తోంది. ఇప్పటికే జ్వరాలు, అనారోగ్య రుగ్మతలతో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. జ్వరాలు ముదిరి ఎవ్వరి ప్రాణాలమీదకు రాకముందే ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టరు, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మచిలీపట్నం, జూలై 12: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా కూడా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖాధికారులు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు నేటి నుండి ఐదు రోజుల పాటు జిల్లాలో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జిల్లా రక్షిత మంచినీటి సరఫరా శాఖ, జిల్లా పంచాయతీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జిల్లాలో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా పైప్‌లైన్‌లు లీకైనా తక్షణమే మరమ్మతులు చేపట్టనున్నారు. అలాగే ప్రతి గ్రామంలో మంచినీటి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌లకు పంపి రిపోర్టుల ఆధారంగా తగు చర్యలు తీసుకోనున్నారు.

గ్రామాల్లో పట్టుబిగిస్తున్న ‘జోగి’
బంటుమిల్లి, జూలై 12: మండలంలో వైకాపాలో పట్టు బిగించేందుకు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. బంటుమిల్లి, ముల్లపర్రు, చోరంపూడి గ్రామాల్లో ఆయన పర్యటించి నాయకులు, కార్యకర్తల మద్దతు కోరారు. బంటుమిల్లిలోని సీనియర్ నాయకులు సుజ్ఞానం వెంకటరెడ్డి నాయుడు, సుజ్ఞానం మహేష్‌లను కలిసి వారి మద్దతు కోరారు. చోరంపూడి గ్రామంలో ఆ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావుతో కలిసి విస్తృతంగా పర్యటించి శ్రీనివాసరావు వర్గాన్ని కలుపుకునే ప్రయత్నం చేశారు. చోరంపూడి పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలను సమీకరించి వారి మద్దతు కోరారు.