కృష్ణ

ఉధ్ధృతంగా తమ్మిలేరు ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, ఆగస్టు 20: కురుస్తున్న వర్షాల కారణంగా తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జీ కలెక్టరు, జేసీ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని బలివే గ్రామం వద్ద ఉన్న తమ్మిలేరులో ప్రవహిస్తున్న వరద నీటిని ఆమె సోమవారం ఆర్డీఓ చెరుకూరి రంగయ్యతో కలిసి పరిశీలించారు. గంటగంటకు వరద నీటి ఉదృతి అధికమవుతుండటంతో ఆమె అధికారులను అప్రమత్తం చే శారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఏమైనా సంఘటనలు జరిగితే అధికారులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. బలివే మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు తమ్మిలేరుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద నీటి ఉధృతికి కోతకు గురై కొట్టుకు పోవడంతో నీరు తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన రహదా రి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కేబీ సీతారామ్‌ను ఆదేశించారు. వర్షాలు పడుతున్నందున మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలకు వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చ ర్యలు తీసుకోవాలని, తాగునీరు, విద్యుత్, పారిశు ద్ధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ మె ఎంపీడీఓ పి శంకరరావును ఆదేశించారు. అలాగే తమ్మిలేరు పరివాహక గ్రామాలైన బలివే , ఎల్లాపురం, వలసపల్లి, గుళ్ళపూడి, లోపూడి గ్రామాల్లో త మ్మిలేరు వెంబడి పోలీస్ పహారా ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తు వారిని ఆప్రమత్తం చేయాలని ఎస్‌ఐ కెవిజివి సత్యనారాయణను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా నీరు పోయే విధంగా చ ర్యలు చేపట్టాలని, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో నే ఉండి పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు జెసి విజయకృష్ణన్ సూచించారు. జేసీ వెంట ఎంపీపీ మలిపెద్ది విజయమధుసూధనరావు, జడ్‌పీటీసీ సభ్యులు చిలుకూరి వెంకటేశ్వరరావు, ఆర్ ఐ మరియన్న, ఆయా శాఖల అధికారులు రమణ య్య, యోహాను, నాయకులు కాటేపల్లి సత్యనారాయణ, మంగయ్య చిన్నం శ్రీనివాసరావు, విఆర్‌ఓలు ఆమర్‌చంద్, శ్రీనివాసరావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పాముకాటుకు పూర్తిస్థాయి వైద్యసేవలు: ఉపసభాపతి బుద్ధప్రసాద్
నాగాయలంక, ఆగస్టు 20: దివిసీమలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు గత కొన్ని రోజులుగా పాముకాటుకు గురై అవనిగడ్డలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారని, వీరందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం కోడూరు, మందపాకల, నాగాయలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగాయలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పాము కాటుకు గురవుతున్న వ్యక్తులు సరైన అవగాహన లేని కారణంగా తమ సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లకుండా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి అందరూ వస్తున్నారని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పలువురు వ్యక్తులు పాముకాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలలో సంబంధిత వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నాగాయలంక పీహెచ్‌సీలో 17, ఎదురుమొండిలో 14, సొర్లగొందిలో 10, మ ందపాకలలో 12, కోడూరు పీహెచ్‌సీలో ఆరు చొప్పున ఈ వ్యాక్సినేషన్ ఉంచినట్లు బుద్ధప్రసాద్ తెలిపారు. బుద్ధప్రసాద్ పర్యటనలో తహశీల్దార్ నారదముని, పీహెచ్‌సీ వై ద్యాధికారిణి జయసుధ, వీఆర్‌ఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వరుస వర్షాలతో కునారిల్లుతున్న ప్రజలు
మోపిదేవి, ఆగస్టు 20: గత పది రోజులుగా వరుసగా వర్షాలు పడుతుండటంతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం విధుల్లో భాగంగా డ్రైన్‌లను ప్రొక్లైన్‌తో తవ్వుతున్నారు. పెదప్రోలు గ్రామంలో గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ జె స్వర్ణ్భారతి ఆధ్వర్యంలో కార్యదర్శి మాధవేంద్రరావు సిబ్బందితో డ్రెయిన్‌ల పూడిక తీయిస్తున్నారు. మోపిదేవి తదితర గ్రామాల్లో మురుగునీటితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.