కృష్ణ

పోలీసులు అవమానించారంటూ ఎంపీటీసీ సభ్యురాలు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబర్ 17: చిల్లకల్లు పోలీసులు తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఆరోపిస్తూ అనుమంచిపల్లి గ్రామ ఎంపీటీసి పానుగంటి రాములమ్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన వినాయకుడి ఊరేగింపులో చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఒక మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడటం తనను మనస్థాపానికి గురి చేసిందని, తాము వినాయకుడిని వేదాద్రి కృష్ణానదిలో నిమజ్జనం చేయాలని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ తమ పందిళ్ల వద్దకు వచ్చి తమను దూషించి విగ్రహాలను తీసుకువెళ్లి ఊరి చివర మురికి కాలువలో పడవేశారని తన రాజీనామా పత్రంలో ఆరోపించారు. సోమవారం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడిఒ ఎస్‌వి ప్రసాద్‌ను తన అనుచరులతో కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.

గుడివాడలో భారీ వర్షం
గుడివాడ, సెప్టెంబర్ 17: గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమయింది. దీనితో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత రెండు రోజుల నుండి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. మరోవైపు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.