కృష్ణ

జీవంపోసుకుంటున్న ‘సంజీవని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, సెప్టెంబర్ 18: పేదోడి వంట్లో జబ్బు చూస్తాం.. అతని జేబులో డబ్బులు చూడం.. అంటూ రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని మల్టీ వైద్యాలయం ద్వారా పేదవాడికి ఉత్తమ వైద్యసేవలు అందించేందుకే సిలికానాంధ్ర వసుదైక కుటుంబం, దాతల సహకారంతో కూచిపూడిలో ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు నాట్యారామ కమిటీ చైర్మన్, సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పేర్కొన్నారు. సిలికానాంధ్ర సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయం ఆక్టోబర్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆనంద్ కృషి, పట్టుదల, అంకితభావం, కార్యదక్షత, ఆత్మవిశ్వాసాల ఫలితమే సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయ నిర్మాణం. స్థానిక పసుమర్తి వారి ధర్మచెరువులో రూ.65కోట్ల అంచనాలతో గత ఏడాది మార్చి 27వ తేదీన భూమిపూజ జరిగిన వైద్యాలయం అండర్ గ్రౌండ్, ఐదు అంతస్తుల భవనం సెంట్రల్ ఏసీ. దాదాపు జిల్లాలోనే ఇటువంటి వైద్యశాల కూచిపూడిలో నిర్మించటం ఆనంద్ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటున్నారు. 200 పడకల సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయ నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐలతో పాటు టీవీ-9 ప్రసార చానల్ అధిపతి రవి ప్రకాష్ రూ.4కోట్ల విరాళంతో పాటు ఆయన చొరవతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా దాతలు రూ.15కోట్లు విరాళం అందచేయటంతో పాటు అనేకమంది తమ దాతృత్వంతో వెల్లువగా విరాళాలు అందజేశారు. వందలాది గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందించేందుకు కూచిభొట్ల ఆనంద్ అకుంటిత దీక్షతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఈ వైద్యశాలలో కిడ్నీ, గైనకాలజీ, ఊపరితిత్తులు, గుండె, పెరాలసిస్, నరాలకు సంబంధించిన శస్త్ర చికిత్సలతో పాటు కంటి, దంత వైద్య చికిత్సలతో పాటు 24గంటలు ప్రమాద చికిత్సలు, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌లకు సౌకర్యాలు కలిగినదే సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయం. ఐదు ఆపరేషన్ దియేటర్లు, రెండు ఐసీయు గదులు, పది కార్డియాలజి, అంబులెన్స్ సౌకర్యంతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో అత్యవసర వైద్యసేవలు నిర్వహించుకునేందుకు ప్రతి మండలంలో అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. ఆధునిక ఫర్నీచర్, బెడ్లు, శస్త్ర చికిత్సల మిషన్‌లతో సంజీవని వైద్యాలయం జిల్లాకే గర్వకారణంగా రూపుదిద్దుకుంటోంది.

అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలి
నూజివీడు, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మహారాష్ట్ర జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ నూజివీడు నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం తీర్మానించింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నూజివీడు నియోజకవర్గం ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం స్ధానిక టీడీపీ కార్యాలయంలో జరిగింది. బాబ్లి పనులు పరిశీలించేందుకు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పుడు అరెస్టు వారెంట్ జారీ చేయటం విడ్డూరంగా ఉందని అన్నరు. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమేనని పేర్కొంటూ దీనిని రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ, కొండా మంగయ్య, దేవినేని డెలారామ్ తదితరులు పాల్గొన్నారు.

జాబ్‌మేళాలతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
* 25న తిరువూరులో జాబ్‌మేళా
* కలెక్టర్ బి లక్ష్మీకాంతం
విజయవాడ, సెప్టెంబర్ 18: స్థానిక నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. మంగళవారం నగరంలోని తమ విడిది కార్యాలయంలో కలెక్టర్ బి లక్ష్మీకాంతం తిరువూరులో ఈ నెల 25వ తేదీన జాబ్‌మేళాను నిర్వహణపై జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి రమేష్‌కుమార్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు జాబ్‌మేళాలో 17 కంపెనీలు పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, ఇవే కాకుండా ఇంకా 30 కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ జాబ్‌మేళా ద్వారా స్థానిక యువతకు 3,200 ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందన్నారు. 10వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.