కృష్ణ

యోగాతో ఆరోగ్యమైన జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 20: యోగాతో ఆరోగ్యమైన జీవితాన్ని గడపకలుగుతామని మానసిక ప్రశాంతత సాధ్యపడుతుందని మంత్రి డా.కామినేని శ్రీనివాస్ అన్నారు. 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించిందని, జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు యోగా డేను ఘనం స్వచ్ఛందంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎ కనె్వన్షన్ సెంటర్‌లో సోమవారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలు యోగాడేను ఘనంగా ని ర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. యోగా ఒక వ్యాయామం మాత్రమే కాదని మనల్ని మనం పరిరక్షించుకునేందుకు ఒక సాధనం లాగా యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చికిత్స కంటే నివారణ ముఖ్యం అనే విధానంలో క్రమశిక్షణతో కూడిన యోగాను అభ్యసించడం ఎంతో ఉపకరంగా ఉంటుందని మం త్రి పేర్కొన్నారు. నగరంలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యో గాసనాలు దేశవ్యాప్తంగా జరుపుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేయ డం జరుగుతోందన్నారు. యోగాసనాలు అనంతరం యోగా గురువులను సన్మానించడం జరుగుతుందన్నారు. నెహ్రూ యువ కేంద్రం వైస్ చైర్మన్ పి.శేఖర్‌రావు మాట్లాడుతూ దేశంలోని 632 జిల్లాల్లో, లక్ష గ్రామాల్లో యోగాడేను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాస్థాయి యోగాడే కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాష్టస్థ్రాయి వేడుకలను నగరం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, యోగా శిక్షకులు, ఎన్‌సిసి క్యాడెట్లు పా ల్గొంటారన్నారు. అనంతరం యోగా డేలో వినియోగించే టీ షర్ట్‌ను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, ఎన్‌వికె జోనల్ డైరెక్టర్ రిషిపాల్‌సింగ్, ఎన్‌సిసి అధికా రి రాజు, జిల్లా కో-ఆర్డినేటర్ రేవతిపాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఎ కనె్వన్షన్ సెంటర్‌లో జరుగనున్న యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ బాబు.ఎ సోమవారం పరిశీలించి తగిన సూచనలు చేశారు. యో గాలో భాగస్వామ్యం అయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఉదయం 6 గంటలకు హాజరవ్వాలని సంబంధిత అధికారులు, సంస్థ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

పుష్కర ఘాట్ల పర్యవేక్షకుల తీరుపట్ల
కలెక్టర్ బాబు ఏ తీవ్ర అసంతృప్తి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 20: కృష్ణా పుష్కరాల దగ్గర పడుతున్న కొద్దీ దుర్గాఘాట్, సీతమ్మ పాదాల ఘాట్ పనులను నిర్దేశించుకున్న లక్ష్యాలు కంటే ముందుగానే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశలో పర్యవేక్షకుల తీరు సక్రమంగా సంతృప్తికరంగా లేదంటూ జిల్లా కలెక్టర్ బాబు ఎ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ దుర్గాఘాట్, మోడల్ గెస్ట్ హౌస్, సీతమ్మ పాదాల వద్ద జరుగుతున్న పుష్కర ఘాట్ పనులను సోమా, ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. దుర్గాఘాట్ వద్ద ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడాన్ని సోమా ప్రాజెక్ట్ మేనేజర్ వికాస్ సింగ్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద పనులు నెమ్మదిగా జరగడంపై ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌తో ఫోన్‌లో కలెక్టర్ చర్చించారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపులు ఏమైనా ఉంటే నిధులు తక్షణం విడుదల చేయాలన్నారు. జాప్యం ఏమైనా ఉంటే తాను పై స్థాయి అధికారులతో చర్చిస్తానని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పుష్కర పనుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఉన్నందున యుద్ధప్రాతిపదిన పనులు వేగవంతం అయ్యే విధంగా పర్యవేక్షణ చేయాలని సిఇ సుధాకర్‌కు కలెక్టర్ ఫోన్ ద్వారా పలు సూచనలు చేశారు. అనంతరం మోడల్ గెస్ట్ హౌస్‌ను కంట్రోల్ రూమ్‌గా మార్చుతున్న పనులను ఆయన పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌లో ప్రణాళికకు భిన్నంగా జరుగుతున్న పనులను ఆపాలని, కింద భాగమంతా ఓపెన్ హాల్‌గా ఉండాలన్నారు. ఇక్కడి నుండే ముఖ్యమంత్రి పుష్కరాల సమయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌గా వినియోగిస్తారన్నారు. దీనికి అవసరమైన ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్‌లో జరుగుతున్న పనులను ట్యాబ్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి వెంకటరమణ, డిఇ ఆంజనేయప్రసాద్‌లు కలెక్టర్‌కు వివరించారు. అదే విధంగా కంట్రోల్ రూం 3వ అంతస్తుకు చేరుకుని పై భాగంలో ఎయిర్‌పోర్టు మాదిరి పెండ్యాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఇంజనీర్లకు సూచించారు. కలెక్టర్ అక్కడి నుండి బయలుదేరి సీతమ్మపాదాల వద్ద జరుగుతున్న పుష్కరఘాట్ పనులను పర్యవేక్షించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తో పాటు సోమా ప్రాజెక్టు మేనేజర్ వికాస్‌సింగ్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి వెంకటరమణ, డిఇ ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వర్షానికి తడిసి ముద్దయన నగరం
పాయకాపురం, జూన్ 20: రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దైంది. నగర రహదారులన్నీ దాదాపుగా జలమయమైయ్యా యి. కురిసిన వర్షపునీరు పారుదల య్యే అవకాశం లేకపోవడంతో డ్రెయినేజీలు సైతం పొంగిపొర్లి వర్షపునీటికి మురుగునీరు తోడై రోడ్లను ముంచెత్తాయి. అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ పేర్కొన్నట్లుగా రెండు రోజుల పాటు వర్షాలు భారీ స్థాయిలో కాకపోయినప్పటికీ ఒక మోస్తరుగా కురిసి వాతావరణాన్ని చల్లబరిచాయి. కురిసిన వర్షాలకు నగర వాసులు సేదతీరగా కొండ ప్రాంత వాసులు మాత్రం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని భయాందోళనల మధ్య గడిపారని చెప్చొచ్చు. ఎప్పుడు వర్షం కురిసినా కొండ ప్రాంతాల్లో నివసించే వారి గుం డెలు గుభేల్‌మనడం సర్వ సాధారణం. నగరంలో నాలుగింట ఒకటిన్నర శా తం మంది జనాభా కొండ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్నారు. మొగల్‌రాజపురం, చుట్టుగుంట, వన్‌టౌన్ ప్రాంతాల్లో కొండలపై వరకు నివాసాల్ని ఏర్పాటు చేసుకోవడంతో వర్షాలు పడిన సందర్భంలో ఎప్పుడు ఏ కొండ చెరియ విరిగి ఏ ఇంటి పై పడుతుందోనన్న భయం వీరిని కలవరపరుస్తుంది. వీరు ఊహించినట్లుగానే గతంలో సైతం మట్టిపెళ్లలు, కొండ చరియలు పడి అనేక మంది మృతి చెందటం, ఎంతో మంది గాయాల పాలవ్వడం జరిగింది. దీని కారణంగానే వీరికి వర్షాలు పడుతున్నాయంటే హడల్. ఇక నగర డ్రెయినేజీ వ్యవస్థ కూడా దారుణంగా ఉండటం, పూడికలు తీయపోవడంతో వర్షం కురిస్తే నగర రహదారులు దారుణంగా తయారవుతున్నాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు 5వ నెంబరు జాతీయ రహదారి జలమయమైంది. అలాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నీరు నిలిచిపోయింది.