కృష్ణ

ఎయిర్‌పోర్ట్‌ను తలదనే్నలా విజయవాడ రైల్వేస్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జూన్ 20: విజయవాడ రైల్వేస్టేషన్ చరిత్రలో సోమవారం రాత్రి సువర్ణ్ధ్యాయంతో లిఖించబడింది. ఒకే క్షణంలో మూడు బృహత్తర ప్రాజెక్టులకు కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. రాజధానికి తరలివస్తున్న ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని విజయవాడ-గుంటూరు-సికింద్రాబాద్‌ల మధ్య నడవనున్న ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. రూ.323 కోట్లతో 40కిమీ మేర గుంతకల్లు-కల్లూరు మధ్య చేపట్టనున్న డబ్లింగ్‌కు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 146 ఎకరాల్లో రూ.240 కోట్లతో చేపట్టనున్న మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి ప్రభు మాట్లాడుతూ విజయవాడ నుంచి 7కిమీ దూరంలో ఉన్న అమరావతికి రైలుమార్గం నిర్మాణానికి త్వరలో సర్వే పనులు ప్రారంభిస్తామంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రధాన రైళ్లన్నీ అమరావతి మీదుగా నడిచేలా దశలవారీగా చర్యలు చేపట్టగలమన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి తిరుపతికి కొత్త రైలుమార్గం నిర్మాణానికి సర్వే చేపట్టగలమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ విజయవాడ రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయం తలదనే్నలా తీర్చిదిద్దాలని కోరారు. మచిలీపట్నం-గుడివాడ-్భమవరం, కోటిపల్లి-నర్సాపురం, కాకినాడ-పిఠాపురం మధ్య డబ్లింగ్, ఖమ్మం-ఒంగోలు మధ్య కొత్త రైలుమార్గాల నిర్మాణానికి సర్వే పనులు త్వరలో ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్థానిక ఎంపి కేశినేని, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి, స్థానిక శాసనసభ్యులు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రైల్వే జిఎం రవీంద్రగుప్తా, డిఆర్‌ఎం అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిఐటియు మహాసభలకు పిఎన్‌ఎం ప్రచారం
విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 20: సిఐటియు రాష్ట్ర 14వ మహాసభలు ఈ నెల 26 నుండి నగరంలో జరుగనున్న నేపథ్యంలో ఈ నెల 22 నుండి 24 వరకు నగరవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు కవి సోమవారం తెలిపారు. ప్రజానాట్యమండలి ద్వారా వివిధ కళా రూపాలతో కార్మికులను, ప్రజలను కలిసి ప్రచారం చేస్తామని, నేడు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైవిధ్యమైన కళారూపాలతో ప్రచారం చేస్తామన్నారు. సు మారు 100 ప్రదర్శనలు 150 ప్రాంతా ల్లో ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఆర్భాటపు ప్రచారం సాగిస్తున్న చంద్రబాబు అభివృద్ధిలో కార్మికులను మాత్రం భాగస్వామ్యం చేయడం లేదన్నారు. స్థానిక కార్మకులకు ఉపాధి చూపకుండా ఇత ర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకొచ్చి వారికి కార్మిక చట్టం ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించకుండా తక్కువ కూలి ఇస్తూ శ్రమ దోచుకుంటున్న వైనాన్ని ప్రదర్శనల ద్వారా వివరిస్తామన్నారు. 22న లెనిన్ సెంటర్‌లో, 23న విద్యాధరపురం చెరువు సెంటర్, 24న సింగ్‌నగర్ పైపుల రోడ్డు సెంటర్‌లో కళారూపాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వీధి నాటికలు, డప్పుల నృత్యం, తప్పెటగుళ్ల కళారూపం, పాటలు, విచిత్ర వేషాలు, జానపద కళారూపాలు, సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు ప్రదర్శిస్తామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో నాటిక దర్శకులు, నటులు, సాహితీ ప్రముఖులు, సిఐటియు రాష్ట్ర, నగర నాయకులు, తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు.

చెత్తను ఎప్పటి కప్పుడు తొలగించాలి
ఇంద్రకీలాద్రి, జూన్ 20: రానున్న వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రెయిన్‌ల్లో చెత్త, చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని, ఇదేవిధంగా రోడ్ డివైవింగ్ వలన వచ్చు డెబ్రిస్‌ను ఎటువంటి పరిస్థితుల్లో మురుగుకాలువలో వేయరాదని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ సూచన చేశారు. పర్యటనలో భాగంగా శనివారం ఆయన పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్‌లో జరుగుతున్న వివిధ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో వియంసికు చెందిన అధికారులు సిహెచ్ రామకోటేశ్వరావుతోపాటు పలుసెక్షన్‌లకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నిత్యం ఇంటితోపాటు పరిసరాలను కూడా సాధ్యమైనవరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొంటే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చిక్కెన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఉండదని 21వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ బాలస్వామి పేర్కొన్నారు. మలేరియా మాసోత్సవాలు సందర్భంగా బిషష్ అజరయ్య స్కూల్ అవరణలో శనివారం ఉదయం కార్యక్రమం జరిగింది. నరగపాలక సంస్థ బయోలిస్ట్ ఎ నూకరాజు, ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేరిరోస్టిన్, సిబ్బంది పాల్గొన్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో
మున్సిపల్ కమిషనర్ పర్యటన
విజయవాడ (క్రైం), జూన్ 20: నగరంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్ సోమవారం పర్యటించారు. ఎంజిరోడ్డు, పిన్నమనేని పాలి క్లినిక్‌రోడ్డు, మొగ్రలాజపురం, విశాలాంధ్ర రోడ్డు, బిఆర్‌టిఎస్ రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్ జంక్షన్, మిల్క్‌ప్రాజెక్టు, కబేళా, ఊర్మిళా సుబ్బారావునగర్, సితార జంక్షన్, టిపి రోడ్డు, గణపతిరావు రోడ్డు, లో బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మధర్ థెరిస్సా జంక్షన్, బిఎస్‌ఆర్‌కె స్కూలు, విశాలాంధ్ర రోడ్డు, గణపతిరావు రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిండటాన్ని గమనించారు. దీంతో అధికారులకు పలు సూచనలు చేస్తూ నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని, పల్లంగా ఉన్న ప్రాంతాల్లో నీరు సైడ్ డ్రెయిన్‌లకు మళ్లించాలని సూచించారు. అదేవిధంగా సైడ్ డ్రెయిన్‌లలో మురుగునీటి ప్రవాహనానికి అడ్డంగా నిలిచిన చెత్త, వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించి డ్రెయిన్ ద్వారా మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.