కృష్ణ

పెట్టుబడికి మించిన సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: జపాన్‌కు చెందిన కీ సంస్థ మన రాష్ట్రానికి పెట్టుబడుల కంటే మించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నారని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. తిరుపతి, విశాఖపట్నంలో ఐఓటి సెంటర్ల ఏర్పాటుపై విజయవాడలోని గేట్ వే హోటల్‌లో బుధవారం సాయంత్రం ఎపి ఐటి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ, జపాన్‌కు చెందిన కీ సంస్థ మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి జరిగింది. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి ఐటి సలహాదారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎ చౌదరి, కీ సంస్థ సిఇఓ మసనారిలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విప్లవం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న అత్యంత ఆధునిక సాంకేతికతను చంద్రబాబునాయుడు, తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆ క్రమంలోనే జపాన్ టెక్నాలజీని, వారి సాంకేతిక సహకారాన్ని పొందుతోందని తెలిపారు. కీ సంస్థ సహకారం తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడిటి) మొదలుకొని పలు రంగాలకు విస్తరిస్తుందని వివరించారు. ఇదో కొత్త అధ్యాయం అని అభివర్ణించి దీనికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. జపాన్‌లో 1950 నాటికే బులెట్ ట్రైన్‌లు ఉన్నాయని, టెక్నాలజీలో వారు ముందున్నారన్నారు.
ఐటి పాలసీ, ఇన్నోవేషన్ పాలసీల ద్వారా పరిపాలనలో ఈ గవర్నెన్స్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రగతి ద్వారా ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు వస్తాయని తెలిపారు. ప్రపంచంలో ఈ ప్రగతి ద్వారా పరిపాలన సాగించే దేశాలు పది మాత్రమే ఉన్నాయన్నారు. మన రాష్ట్రం కూడా ఈ ప్రగతిని సాధిస్తే దక్షిణాసియాలోనే మొదటి రాష్ట్రం అవుతుందని చెప్పారు. డిజిటలైజేషన్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. 84 లక్షల మంది రైతుల సమాచారం, 43.80 లక్షల మంది పింఛన్, కోటి 30 లక్షల మంది రైతుల సమాచారం డిజిటలైజేషన్ చేసినట్లు మంత్రి వివరించారు. ఇ-ఫైల్స్‌లో కూడా మనం ముందున్నట్లు తెలిపారు. 321 కోట్ల రూపాయల ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పారు. సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్రంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. కీ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం మన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో విజ్ఞానపరంగా అత్యంత ప్రతిభావంతులు, సమర్థులు ఉన్నారన్నారు. మేథాసంపత్తికి కొదవలేదని కొనియాడారు. విదేశాలలో పలు బహుళ జాతి కంపెనీలకు సిఇఓలుగా తెలుగువారు ఉండటం, మనవారి ప్రావీణ్యతను తెలియజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రతి ఏటా వివిధ అంశాలలో డిగ్రీ చదువులు పూర్తి చేసుకుని ఆరు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారని చెప్పారు. కీ సంస్థ సిఇఓ మసనారి మాట్లాడుతూ ఎపి ప్రభుత్వంలో ఇటువంటి ఒప్పందం చేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థకు సంబంధించిన ఐఓటి సెంటర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర అన్ని రంగాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఐఓటి సెంటర్లలో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. జెఎ చౌదరి మాట్లాడుతూ విశాఖపట్నం ఫిన్ టెక్ (ఫైనాన్సియల్ టెక్నాలజీ) క్యాపిటల్‌గా రూపొందుతుందన్నారు. అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కీ సంస్థ వారు విశాఖలో పెద్ద ఐఓటి సంస్థ నెలకొల్పుతారని చెప్పారు. అక్కడ ఇన్నోవేషన్ సెంటర్‌లో కొద్ది భాగం వారికి కేటాయిస్తామన్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీస్‌లో ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నట్లు తెలిపారు. నాగార్జున యూనివర్శిటీలో డిజిటల్ ఫోరెన్సిక్‌లో ఓ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ కోర్సు ప్రస్తుతానికి గుజరాత్ యూనివర్శిటీలో మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఈ కోర్సు చేసిన వారు తక్కువ మంది ఉన్నారని, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

సైకిలెక్కిన వైకాపా సర్పంచ్‌లు
కూచిపూడి, జూలై 20: మొవ్వ మండలానికి చెందిన వైకాపా సర్పంచ్‌లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బుధవారం భారీ ర్యాలీగా నియోజకవర్గ కేంద్రమైన పామర్రుకు తరలివెళ్లారు. మండలంలోని కోసూరు గ్రామ సర్పంచ్ చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, 10 మంది వార్డు సభ్యులు, ఆరుగురు సహకార సొసైటీ డైరెక్టర్లతో పాటు వందలాది మంది అభిమానులతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పామర్రుకు తరలివెళ్లారు. మొవ్వ సర్పంచ్ తాతినేని పిచ్చేశ్వరరావు, పంచాయతీ పాలకవర్గ సభ్యుల్లోని అభిమానులతో పామర్రుకు తరలివెళ్లారు. మొవ్వపాలెం సర్పంచ్ ఊసా సుబ్బులు వీరితో పాటు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తరలివెళ్లారు. పామర్రులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంక్షేమం, ఎక్సైజ్, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సమక్షంలో పార్టీలో చేరేందుకు తరలి వెళుతున్నట్లు వారు విలేఖర్లకు తెలిపారు. మొవ్వ వైస్ ఎంపిపి నన్నపనేని వీరేంద్ర, టిడిపి నాయకులు తాతినేని పూర్ణచంద్రరావు, మురారి శివప్రసాద్, యద్దనపూడి రాగశేఖర్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

నదుల అనుసంధానం చంద్రబాబు ఘనతే..

తోట్లవల్లూరు, జూలై 20: పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని టిడిపి జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. బుధవారం కెఇబి కెనాల్‌లో ప్రవహిస్తున్న గోదావరి జలాలకు టిడిపి నాయకులు వివి గురుమూర్తి, సర్పంచ్ చిరుమామిళ్ల ఉమాదేవి, ఎంపిటిసి తోట రత్నకుమారి, గ్రామ టిడిపి అధ్యక్షుడు ఎన్ మురళి, తదితరులు పసుపు, కుంకమ, పూలతో ఇక్కడ పూజలు చేసి స్వాగతం పలికారు. ఈసందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తీసుకొచ్చి కాలువల ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించి రైతులు నాట్లు వేసుకోటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. కెఇబి కెనాల్‌కు 500 క్యూసెక్కులు, బందరు కాలువకు 504, ఏలూరు కాలువకు 515, రైవస్ కాలువకు 2005, గుంటూరు కాలువకు 1516 క్యూసెక్కలు చొప్పున నీటిని విడుదల చేశారని తెలిపారు. దీంతో కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటలు సకాలంలో పండేందుకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. పట్టిసీమ పథకం వద్దని విమర్శించిన వైసిపి, కాంగ్రెస్ నాయకులు దీనిపై ఏమి సమాధానం చెపుతారని గురుమూర్తి ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తోట సాయిబాబు, రాజులపాటి వెంకట సుబ్బారావు, వల్లూరు సుదర్శనరావు పాల్గొన్నారు.