కృష్ణ

పుష్కర విధుల్లో 20మంది ఐపిఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 20: కృష్ణా పుష్కర మహోత్సవాలు దగ్గరపడుతున్న క్రమంలో పోలీసుశాఖ మరింత పటిష్ఠ చర్యలు చేపట్టింది. ప్రధానంగా రాజమండ్రి గోదావరి పుష్కరాల ఘటన దృష్ట్యా బందోబస్తు, భద్రతాపరమైన చర్యలతోపాటు, ప్రధానంగా తొక్కిసలాటకు తావులేకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరించేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను భారీ ఎత్తున అధికారులు, సిబ్బంది ప్రత్యేక బాధ్యతలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఘాట్‌ల వద్ద రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఏవిధమైన అపశ్రుతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటోంది. దీనికి తోడు నిఘా పటిష్టం చేస్తోంది. కృష్ణాపుష్కరాలకు నగరంలోని నదీ పరివాహక ప్రాంతంలో మొత్తం 17 ఘాట్‌లను గుర్తించి ఇప్పటికే నిర్మాణాలు, ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఆయా ఘాట్‌లకు పోలీసు అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమితులైనట్లు తెలుస్తోంది. 17 ఘాట్‌లకు 17మంది ఐపిఎస్ అధికారులకు ఒక్కొక్కరూ బాధ్యతలు కేటాయించినట్లు సమాచారం. ప్రతి ఐపిఎస్ స్థాయి అధికారి తమకు కేటాయించిన ఘాట్‌లను దగ్గర ఉండి మరీ పర్యవేక్షిస్తారు. ఈ 17మంది ఐపిఎస్‌లు కాకుండా మరో ముగ్గురు ఐపిఎస్ అధికారులు నిరంతరం 17 ఘాట్‌లను సందర్శిస్తూ పర్యవేక్షిస్తారు. అంటే ఈ ముగ్గురు ఐపిఎస్‌లు మొబైల్ టీమ్‌గా వ్యవహరిస్తారు. నగరంలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్‌ల నుంచి ఘాట్‌ల వరకు వెళ్లే మార్గంలో అదేవిధంగా ఆగస్టు 12 నుంచి 24 వరకు పుష్కర విధలు నిర్వహించేందుకు సుమారు 17వేల మంది వరకు అధికారులు, సిబ్బందిని కేటాయించడం జరిగింది. ఇక నిఘా విషయానికొస్తే... పుష్కరాలకు సుమారు 1500 వరకు అత్యాధునిక సిసి కెమేరాలు వినియోగంలోకి తీసుకువస్తున్నారు. ఇవన్నీ నగరంతోపాటు పుష్కరనగర్‌లు, పుష్కర ఘాట్‌ల వద్ద విఐపిలు వచ్చి వెళ్ళే మార్గాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితోపాటు నాలుగు డ్రోన్ కెమేరాలు నిరంతరం సంచరిస్తూ నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం జరుగుతుంది. వీటి ద్వారా వచ్చే సమాచారం ప్రత్యేక కంట్రోల్ రూముకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇదిలావుండగా.. జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్‌ను పుష్కర ప్రత్యేక విధులకు దూరంగా ఉంచినట్లు కమిషనరేట్‌లో చర్చగా మారింది. గోదావరి పుష్కరాల సమయంలోనూ.. అదేవిధంగా తుని రైలు ఘటన సందర్భంలోనూ ఆయన పనితీరును, వైఫల్యాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కృష్ణాపుష్కర ప్రత్యేక విధుల పర్యవేక్షణకు ఇంటిలిజెన్స్ ఐజి మహేష్ చంద్ర లడ్హాకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. జాయింట్ పోలీసు కమిషనర్ డిఐజి హోదాలో అందరితోపాటు విధులు నిర్వహించడమేగాని, ప్రత్యేకంగా పర్యవేక్షణంటూ ఉండకపోవచ్చని, మొత్తం పుష్కర విధుల ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలు లడ్హా చూసే అవకాశం ఉందని కమిషనరేట్‌లోని విశ్వనీయ వర్గాల సమాచారం.

తుది మెరుగులు దిద్దుకుంటున్న శ్రీవారి ఆలయం

విజయవాడ, జూలై 20: నగరంలోని పిడబ్ల్యుడి గ్రౌండ్స్ ఆవరణలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, తిరుమల నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. తిరుమలలో జరిగే అన్ని సేవలు అంతర్గతంగా ఆలయంలో అధికారులు నిర్వహించడంతో పాటు భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు 4 క్యూలైన్లలో దర్శనాన్ని కల్పిస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. బస్‌స్టాండ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో, రైల్వేస్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో, బెంజి సర్కిల్ నుండి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అదేవిధంగా కృష్ణా - గోదావరి పవిత్ర సంగమమైన ఇబ్రహీంపట్నం ఫెర్రి పాయింట్‌లో రాష్ట్రంలోని 8 నమూనా ఆలయాలను ఏర్పాటు చేస్తున్నారు. అవి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం (కాణిపాకం, చిత్తూరు జిల్లా), శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం (ఇంద్రకీలాద్రి, విజయవాడ), శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం (శ్రీశైలం, కర్నూలు జిల్లా), శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవాలయం (శ్రీకూర్మం, శ్రీకాకుళం జిల్లా), శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం (బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా), శ్రీ రామనాథస్వామి వారి దేవాలయం (రామతీర్థం, విజయనగరం జిల్లా), శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (కదిరి, అనంతపురం జిల్లా), శ్రీ పాండురంగస్వామి వారి దేవాలయం (చిలకలపూడి, మచిలీపట్నం) ఏర్పాటు చేస్తున్నారు.

నాటిన మొక్కలపై నివేదిక ఇవ్వాలి
విజయవాడ (కార్పొరేషన్), జూలై 20: హరిత నగరంగా అభివృద్ది చేయాలనుకొంటున్న ప్రస్తుత తరుణంలో నగర వ్యాప్తంగా నాటుతున్న మొక్కల వివరాలపై విధిగా నివేదిక అందజేయాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా బుధవారం ఉదయం తన ఛాంబర్‌లో విఎంసి హార్టీకల్చర్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఏరోజు నాటిన మొక్కలను ఆరోజే స్థానిక కార్పొరేటర్‌తో సంతకం చేయించుకొని నివేదిక ఇవ్వాలన్నారు. నాటిన మొక్కల ఎదుగుదలకు తగు చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. వచ్చే నెలలో జరగబోయే కృష్ణా పుష్కరాలకు చేపడుతున్న మొక్కల నాటే పనుల వివరాలపై అధికారుల వివరణ అడిగిన మేయర్ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈసందర్భంగా అధికారులు తమ నివేదిక వివరిస్తూ పంటకాల్వ రోడ్డులో రెండు వేల మొక్కలు, సాంబమూర్తి రోడ్డులో మరో వెయ్యి మొక్కలను నాటినట్టు తెలిపారు. అలాగే గ్రీన్ బెల్టులో భాగంగా కెనాల్ గట్టులను శుభ్రం చేశామన్నారు. కాంట్రాక్ట్ ఇచ్చిన చోట కూడా విఎంసి సిబ్బంది పనిచేస్తుండటంతో మొక్కలు నాటేందుకు సిబ్బంది కొరత ఉత్పన్నమవుతోందని తెలిపారు. ఈ సమీక్షలో కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, సిద్దెం నాగేంద్రరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ ప్రతాప్‌కుమార్, పార్కు సూపర్‌వైజర్లు పలువురు పాల్గొన్నారు.

పోస్టర్ ఫ్రీ నగరంగా బెజవాడ
విజయవాడ (కార్పొరేషన్), జూలై 20: రాష్ట్ర రాజధాని నగరంగా విరాజిల్లు తున్న విజయవాడ నగరంలో వాల్ పోస్టర్, పెయిటింగ్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలకు అందరూ సహకరించాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్‌లు పేర్కొన్నారు. ఈసందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని డిఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మింగ్ విజయవాడ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ నగర వీధులను, రహదారులను సుందరీకరణ చేపడుతున్న ప్రస్తుత తరుణంలో గోడలపై విచ్చలవిడిగా అంటిస్తున్న పోస్టర్లు, రాస్తున్న వ్యాపార ప్రకటనలతో సుందరీకరణకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. సుందరీకరణ చర్యలకు ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా గోడలు సైతం అందంగా తీర్చిదిద్దేందుకు గాను గోడలపై విద్యార్థుల కళాత్మక ఆలోచనల చిత్రాలను ప్రదర్శించి అందంగా తీర్చిదిద్దేందుకు ఈకార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. నగరంలోని ప్రధాన రహదారులైన ఏలూరు, బందర్ రోడ్ల కిరువైపులా ఉన్న గోడలను సుందరీకరించేందుకు గాను సుమారు వెయ్యి మంది విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పోస్టర్ ఫ్రీ బాధ్యతలను మార్గమ్స్ అనే స్వచ్చంద సేవా సంస్థకు అప్పగించడం జరిగిందని, వీరి పర్యవేక్షణలో విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించి గోడలపై విచ్చలవిడిగా అంటించిన పోస్టర్లను తొలగించి గోడలను శుభ్రపర్చి అనంతరం వాటిపై కళా చిత్రాలను గీయడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన పెయిటింగ్స్, బ్రెష్, హెల్పర్లను విఎంసి సమకూర్చుతుందని కమిషనర్ పేర్కొన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్, జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సేవా దృక్పథం పెంపొందించడం జరుగుతోందన్నారు. ఆ దృక్పథంతోనే విద్యార్థులు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలతోపాటు విజ్ఞానాన్ని పెంచే చిత్రాలను వేసి ప్రజలను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని హితవుపలికారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిహెచ్ సుజాత, కో-ఆప్షన్ సభ్యుడు సిద్దం నాగేంద్రరెడ్డి, విఆర్ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ కాలేజెస్, నలంద విద్యా సంస్థలు, కెఎల్ యూనివర్శిటీ తదితరులు పాల్గొన్నారు.

యుద్ధప్రాతిపదికన పుష్కర పనులు
* ఘాట్లు పరిశీలించిన ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 20: పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు ఈ మాసాంతానికి పూర్తి చేసేలా యుద్ధప్రాతిపదికన 24గంటలు పనులు నిర్వహిస్తున్నామని పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ బి.రాజశేఖర్ అన్నారు. బుధవారం పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండయన్‌తో కలిసి కృష్ణవేణి ఘాట్లుల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ మాసాంతానికి అన్ని పనులు పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఆగస్టు 12 నుండి ప్రారంభమయ్యే పుష్కరాలకు 72 గంటలు ముందే అధికారులు, సిబ్బంది ఘాట్లు, పుష్కరనగర్‌లు సిద్ధంగా ఉండి ట్రైల్ రన్ నిర్వహిస్తారన్నారు. ప్రతీ ఘాట్‌కు మూడు షిఫ్టులలో అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 74 ఘాట్లు, 36 పుష్కరనగర్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాలకై మూడున్నర కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున యాత్రికులు రాకను ముందుగా అంచనా వేసి పుష్కరనగర్‌లలో తాత్కాలిక వసతి కల్పిస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృష్ణవేణి ఘాట్‌ను పరిశీలిస్తారన్నారు. పుష్కరాలలో యాత్రికులకు కల్పించే అన్ని సదుపాయాలు కృష్ణవేణి ఘాట్‌లో ఏర్పాటు చేసి మోడల్ ఘాట్‌గా ముఖ్యమంత్రికి చూపించటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. పిండ ప్రదానం ప్లాట్‌ఫారం, బట్టలు మార్చుకునే గది, వైద్య శిబిరం వంటి అన్ని వౌలిక వసతులు కల్పించి ముఖ్యమంత్రికి చూపించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఘాట్‌కు ఆనుకొని ఉన్న శ్రీ శనైశ్చర దేవాలయానికి అవసరమైన మరమ్మతులు నిర్వహించి రంగులతో సుందరీకరించాలని దేవాదాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కృష్ణవేణి ఘాట్‌ను పరిశీలించిన తరువాత వారి సలహా, సూచనలకు అనుగుణంగా ఇతర ఘాట్లలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. లక్ష మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరించే ఏడు ప్రధాన ఘాట్లుగా గుర్తించామన్నారు. ఐదు ప్రధాన శాటిలైట్ రైల్వే స్టేషన్లు, 12 తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులను పుష్కరనగర్‌లకు పంపటం జరుగుతుందన్నారు. పుష్కరనగర్‌ల నుండి ప్రతీ మూడు నిమిషాలకు ఒక బస్ చొప్పున ఘాట్లకు నిరంతరం డెడికేటెడ్ బిఆర్‌టిఎస్‌గా నడుస్తాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా సీతానగరంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ రిస్క్యూటీమ్ నిర్వహించే రిహార్సల్స్‌ను స్పెషల్ ఆఫీసర్ బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండయన్ తిలకించారు. పుష్కరాలలో ఆపదలో ఉన్న యాత్రికులను ఏ విధంగా ఎన్‌టిఆర్‌ఎఫ్ టీమ్ రక్షిస్తుందో రిహార్సల్స్‌లో చూపించారు.