కృష్ణ

ఎక్సైజ్ ఎసి ఇళ్లపై ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 20: ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు మంగళవారం విజయవాడలోని సదరు అధికారి ఇంటితోపాటు పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈసోదాల్లో అసిస్టెంట్ కమిషనర్‌కు చెందిన ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులుగా గుర్తించారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం.. సుమారు 80కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ టీముకు చెందిన ఏసిబి డిఎస్పీ రమాదేవి ఆధ్వర్యాన విజయవాడలో సోదాలు నిర్వహించిన సందర్భంగా ఆమె వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన ఎం ఆదిశేషు ప్రస్తుతం చాగల్లులోని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పని చేస్తున్నారు. ఈయన గతంలో విజయవాడలోనూ ఎక్సైజ్ సిఐగా విధులు నిర్వహించారు. ఈయన అత్తగారి ఇల్లు గుంటూరు జిల్లా. విజయవాడలోని గిరిపురం డాక్టర్ ప్రకాశ్‌నగర్‌లో ఉన్న కృష్ణసాయి టవర్స్‌లో స్వంత అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. కాగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఏసిబి సెంట్రల్ టీము ఏసిబి ప్రత్యేక కోర్టు నుంచి వారెంట్ తీసుకుని డిఎస్పీలు ఎ.రమాదేవి, మురళీకృష్ణ, ప్రసాద్ నేతృత్వంలో 120మంది సిఐలు, 30మంది సిబ్బందితో కలిసి ఏలూరు, విజయవాడ, గుంటూరు మూడు చోట్ల ఏకకాలంలో మూడు బృందాలు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో రూ.28లక్షల వరకు వివిధ బ్యాంకుల్లో నగదు నిల్వలు, అదేవిధంగా విజయవాడలోని ఇంట్లో రూ. 2.08లక్షలు నగదుతోపాటు 540గ్రాముల బంగారం, 2,300 గ్రాముల వెండి, ఐదున్నర లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గుర్తించారు. వీటితోపాటు గుంటూరు జిల్లాలో మూడు చోట్ల, పశ్చిమగోదావరి జిల్లాలో రెండు చోట్ల, తూర్పు గోదావరి జిల్లాలో మూడు చోట్ల కలిపి సుమారు 22.65ఎకరాల స్థలాలు ఉన్నట్లు అందుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని డాక్యుమెంట్లు, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు సీజ్ చేశారు. ఇంట్లో బిల్లులు లేని 14 స్కాచ్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రెండు లాకర్లు తెరవాల్సి ఉందని, ఈసోదాలు గురువారం కూడా కొనసాగుతాయని డిఎస్పీ తెలిపారు.