కృష్ణ

రాష్ట్భ్రావృద్ధికి అధికార వికేంద్రీకరణ అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో సమాన అభవృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ అనివార్యమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) స్పష్టం చేశారు. సోమవారం మచిలీపట్నం కోనేరుసెంటరులో మూడు రాజధానులకు మద్దతు తెలిపే బహిరంగ సభలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం ప్రస్తుతం ప్రజలకు ఒక గుదిబండగా మారిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తే పర్యావరణ సమస్యలు, వరదముప్పు వంటి ఎన్నో అనర్ధాలు జరుగుతాయని శివరామకృష్ణ కమిటీ వాస్తవ నివేదిక ఇస్తే ఆ సూచనలను పెడచెవిన పెట్టి 29 గ్రామాల పరిధిలో రూ.5వేల కోట్ల వ్యయంతో మూడు భవనాలు నిర్మించి చేతులు దులుపుకున్నారన్నారు. దానికి మూల్యంగా యేటా రూ.570 కోట్లు వడ్డీ ప్రజల నెత్తిన రుద్దడం ఎంత మాత్రము భావ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరన్నారు. బందరు పోర్టుకు రూ.450 కోట్లు డీపీఆర్ చేసిన ఘనత, మచిలీపట్నంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అనుమతి ఇచ్చిన తీ రు ఎంతో సాహసోపేతమైనదన్నారు. రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కృత్రిమమైనదని, కులం, ప్రాంతం కోసం పని చేస వారు ఈ విధంగా ప్రజా నాయకులు అవుతారని ప్రశ్నించారు. బందరు పార్లమెంటరీ పరిధిలో అభివృద్ధి కేవలం బందరు పోర్టు నిర్మాణం వల్లనే సాధ్యమవుతుందన్నారు. తొలుత స్థానిక జిల్లా కోర్టు నుంచి కోనేరుసెంటరు వరకు ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, మోకా భాస్కరరావు, షేక్ అచ్చాబా, మారుమూడి విక్టర్ ప్రసాద్, బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు.