కృష్ణ

మహిళల అభ్యున్నద్ధే టిడిపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 27: మహిళల అభ్యున్నతికి, సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే పెద్దపీట వేసిందని పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక ఇంగ్లీష్‌పాలెం షాదీఖానాలో బుధవారం పట్టణ తెలుగుమహిళా విభాగం సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా అర్జునుడు మాట్లాడుతూ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను టిడిపి ప్రభుత్వం గుర్తించిందన్నారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారన్నారు. మహిళా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేశారన్నారు. రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేసి రైతులను బలోపేతం చేసినట్లే మహిళల ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి మహిళా సాధికారత సంస్థను పాటుపడుతోందన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడడానికి గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా నైపుణ్యం కలిగిన మహిళలను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు వారు తయారుచేసిన ఉత్పత్తులను మార్కెట్ చేసి లాభాలను వారికి అందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇతర రాజకీయ పార్టీలు మహిళల సంక్షేమానికి చేసింది శూన్యమన్నారు. ఆడబిడ్డలే పార్టీకి కొండంత అండ అన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల ద్వారా గ్యాస్ ఏజెన్సీల ఏర్పాటు, గ్రూపులకు రుణమాఫీ, స్వయం ఉపాధి, తదితర పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సమర్థులన్నారు. రాజధాని నిర్మాణానికి తెలుగుమహిళ తరపున నిధిని ఏర్పాటు చేసి అందచేయాలన్నారు. ఈసందర్భంగా రూ.25వేల చెక్కును తెలుగుమహిళా విభాగం తరపున అర్జునుడుకు అందచేశారు. ఈ సమావేశంలో తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, నీరజ, రమాదేవి, వనజ, కౌన్సిలర్ హేమ కుసుమ, పట్టణ టిడిపి అధ్యక్షులు ఇలియాస్ పాషా, తదితరులు పాల్గొన్నారు.