కృష్ణ

సమగ్ర భూసర్వేతో భూసమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం జరిగిన భూ సర్వేతో భూమి తన పేరున ఉన్న ఎక్కడ ఏ తప్పు దొర్లి ఏ సమస్య వస్తుందోనని భూ యజమానులు అనుక్షణం ఆందోళన పడుతున్నారని, వాటి నివారణకై సమగ్ర భూసర్వే అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. మంగళవారం సమగ్ర భూసర్వేకు మోడల్ మండలంగా ఎంపికైన జగ్గయ్యపేటలో తహశీల్దార్ కార్యాలయంలో భూసర్వేకు సంబంధించి కార్ సెంటరును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కార్ సెంటరు పనిచేసే విధానం ఆయన అధికారుల నుంచి అడిగితెలుసుకున్నారు. దీనికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో కాని న్యాయ స్థానాల్లో ఉన్న కేసులలో కాని 60శాతం సమస్యలు భూమికి సంబంధించినవే అని , భూ యజమాని భద్రతకు ఈసమగ్ర సర్వే అన్నారు. రైతు సంక్షేమం ధ్యేయమనే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భూసర్వే చేపట్టడం సాహసోపేతమైన చర్య అన్నారు. సభలో రవాణా శాఖమంత్రి పేర్ని వెంకటరామయ్య మాట్లాడుతూ సమగ్ర భూసర్వేతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని, సుపరిపాలన చేస్తుంటే కొన్ని సమస్యలు వస్తాయని అన్నారు. వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. రెవిన్యూ రికార్డులకు సంబంధించి నేషనల్ సబ్‌డివిజన్ కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సర్వేయర్ స్థాయిలోనే డివిజన్ ఇచ్చేలా చూడాలన్నారు. సభకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అధ్యక్షత వహించగా సభలో జిల్లా కలెక్టరు ఇంతియాజ్ భూపరిపాలన కమీషనర్ ప్రభాకరరెడ్డి, మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణప్రసాద్‌లు ప్రసంగించారు. సభలో ల్యాండ్ సర్వేకు సంబంధించి మంత్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలోజాయింట్ కలెక్టరు మాధవిలత, సబ్‌కలెక్టరు ధ్యాన్‌చంద్, రెవిన్యూ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఐఎఏస్ అధికారులు నీరజ్‌కుమార్‌ప్రసాద్ తదితర అధికారులు, తహశీల్దార్‌లు, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.