కృష్ణ

ప్రజా సాధికార సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 12: నగరంలో చేపట్టాల్సిన ప్రజా సాధికార సర్వే ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం విఎంసి కార్యాలయంలోని కౌన్సిల్ భవనంలో సర్వే అధికార, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో సుమారు 65 శాతం సర్వే పూర్తవగా నగరంలో కేవలం 2 శాతం మాత్రమే జరగడం శోచనీయమన్నారు. గత నెలలో జరిగిన కృష్ణా పుష్కరాలకు అధికార, సిబ్బంది అందరూ పుష్కర బాధ్యతలు నిర్వర్తించడం వలన కొంత ఆలస్యం జరిగినందున ఇప్పటికైనా ప్రజా సాధికార సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సర్వేకు అవసరమైన ట్యాబ్‌లు ఎవరికైనా అవసరమైతే వాటిని అందించేందుకు జిల్లా కలెక్టర్ సిద్దంగా ఉన్నారని తెలిపార. సకాలంలో పూర్తి చేసిన ఎన్నికల సర్వే ప్రక్రియ స్ఫూర్తితోనే ఈ సర్వేను కూడా నిర్వహించాలన్నారు. సర్వే సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా విధిగా ఇంటింటికీ వెళ్ళి సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. రానున్న 10 రోజుల్లో సర్వే మొత్తం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వీరపాండియన్ ఆదేశించారు. ఈ సమావేశంలో నగర సబ్ కలెక్టర్ డాక్టర్ సృజన, విఎంసి అదనపు కమిషనర్ నరశింహమూర్తి, డిసిఆర్ సుబ్బారావు, సిటీప్లానర్ శ్రీనివాసులు, అర్బన్ ఎంఆర్‌ఓ శివరావు, తదితరులు పాల్గొన్నారు.