కృష్ణ

కలెక్టర్ గారూ.. సాగునీరు ఇఫ్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 12: కలెక్టర్ గారూ.. మా భూములకు నీరు ఇప్పించండి సారూ.. అంటూ పలువురు రైతులు సోమవారం కలెక్టర్ బాబు.ఎను వేడుకున్నారు. సాగునీటి కొరత కారణంగా చచ్చిపోతున్న మా పంట పొలాలకు నీరు ఇచ్చి రక్షించాలంటూ మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో పలు ప్రాంతాలకు చెందిన రైతులు కలెక్టర్ బాబు.ఎను కలిసి సాగునీటి కష్టాలను వివరించారు. బందరు మండలం శివారు ప్రాంతమైన తాళ్ళపాలెం, కానూరు గ్రామాల్లో న్యూ తాళ్ళపాలెం ఛానల్ కింద 1190 ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. 600 ఎకరాల్లో వెద పద్ధతిన వేసిన పంట నీరు లేక ఎండిపోయిందన్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు కాలువల ద్వారా చుక్క నీరు రాలేదన్నారు. అడపాదడపా కురిసిన వర్షాలతో సాగు చేపట్టామని, కానీ అధిక ఉష్ణోగ్రతలు సాగు చేసిన పంట అంతా చచ్చిపోయిందన్నారు. ఎగువ ప్రాంత రైతులు ఆయిల్ ఇంజన్లతో నీటిని మళ్ళించుకోవడం వల్ల తమకు ఈ సమస్య ఏర్పడిందన్నారు. దీనిపై ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా మీరు స్పందించి ఉన్న కొద్దిపాటి పంటను రక్షించుకునేందుకు నీరు విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కానూరు గ్రామ మాజీ సర్పంచ్ గోపు కృష్ణ భగవాన్, కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ శ్రీకాకుళపు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. అలాగే ఘంటసాల, చల్లపల్లి మండలాల పరిధిలోని లంకపల్లి, పూషడం, ఎండకుదురు, పాత మాజేరు, దాలిపర్రు గ్రామాల రైతులు కూడా కలెక్టర్‌ను కలిసి సాగునీటి సమస్యను వివరించారు. రైతు సంఘ నాయకుడు ఎర్నేని నాగేంద్రం, మాజీ సర్పంచ్ యార్లగడ్డ శివరామప్రసాద్ నాయకత్వంలో కలెక్టర్‌ను కలిసిన నాయకులు ప్రతి యేటా ఎదురవుతున్న సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా తమ గ్రామాలకు క్రాఫ్ హాలిడే ప్రకటించాలని కలెక్టర్‌ను కోరారు. గత మూడేళ్ళు తాము గ్రామాలకు నీరు రాకపోవటంతో నష్టపోతూ వచ్చామన్నారు.

వృద్ధురాలిని మోసగించిన
గుర్తు తెలియని యువకులు

చల్లపల్లి, సెప్టెంబర్ 12: స్థానిక నిమ్మలతోటలో ఒంటరిగా జీవిస్తున్న ముత్యాల నారాయణమ్మ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని ఇద్దరు యువకులు నమ్మించి రూ.12వేలు విలువైన చెవి దిద్దులు అపహరించారు. గత రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు నారాయణమ్మ ఇంటికి వచ్చి గత ఆరు నెలల క్రితం మృతి చెందిన భర్త వెంకటాద్రి ఇల్లు ఇదేనా అంటూ నారాయణమ్మను ప్రశ్నించారు. ఇదేనని చెప్పిన నారాయణమ్మతో ఆ ఇరువురు యువకులు నీ భర్త పేరిట సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో రూ.50వేలు ప్రభుత్వం నుండి వచ్చాయని నమ్మించారు. ఆ నగదు పొందాలంటే ముందుగా తమకు రూ.5వేలు నగదు, బ్యాంక్ పాస్ బుక్, ఎటియం కార్డు ఇవ్వాలన్నారు. వారి మాటలను నమ్మిన నారాయణమ్మ తన వద్ద నగదు లేదని, చెవి దిద్దులు మాత్రమే ఉన్నాయని చెప్పటంతో వాటిని తీసుకున్నారు. మీతో పాటు నేను కూడా బ్యాంక్‌కి వస్తానని వృద్ధురాలు చెప్పినా వినకుండా సెప్టెంబర్ 5వతేదీన బ్యాంక్‌కు వస్తే నగదు ఇస్తామని చెప్పి ఉడాయించారు. 5వతేదీ బ్యాంక్ శెలవ అని తెలుసుకున్న నారాయణమ్మ మరుసటి రోజు బ్యాంక్‌కు వెళ్ళింది. తమ బ్యాంక్ నుండి ఎవరినీ పంపలేదని బ్యాంక్ అధికారులు చెప్పటంతో మోసపోయినట్లు గ్రహించి విషయాన్ని స్థానిక విలేఖర్లకు తెలియజేసింది.

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

ఎ కొండూరు, సెప్టెంబర్ 12: మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని సోమవారం అరెస్టు చేసినట్లు మైలవరం సిఐ డి వెంకటరమణ తెలిపారు. వీరు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన దాసరి కస్తూరి ఈనెల 6న లక్ష్మిపురం గ్రామసమీపంలోని తన పంట పొలంలో గేదెలను మేపుతుండగా ఆదే గ్రామానికి చెందిన శీలం నాగరాజు చెడు అలవాట్లకు బానిసై కస్తూరి మేడలో ఉన్న మూడు కాసుల బంగారు నానుతాడును లాక్కొని తాను వెంట తెచ్చుకున్న తాడుతో మేడకు గట్టిగా బిగించి హత్యాయత్నానికి పాల్పడిన నాగరాజును పోలిశెట్టిపాడు బస్‌స్టాప్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నున్న బంగారు గొలుసును స్వాధీనపర్చుకుని తిరువూరు కోర్టులో హాజరుపర్చినట్లు సిఐ చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ ఎం కన్నప్పరాజు, సిబ్బంది పాల్గొన్నారు.