కరీంనగర్

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నతమైనవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, ఆగస్టు 22: తర తరాలుగా వస్తున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని కోట్లనర్సింహులపల్లి నర్సింహాస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమంలో కెప్టెన్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ఎన్‌ఆర్‌ఐ భక్తుడు అందించిన ఉత్సవ విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా జరిగింది. పురాతనమైన ఆలయాలు తమ దేశంలో ఉండడం, వాటిని సంరక్షించుకోవడంతో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రజలు తమవంతు పాటు పడాలన్నారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ దంపతులకు ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో ఆశీర్వదించారు. అనంతరం గ్రామ ప్రజలు కెప్టెన్‌కు తమ గ్రామ సమస్యలపై వినతిపత్రం అందించి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా గ్రామస్థులు విన్నవించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రామడుగు మండలం తిర్మలాపూర్ నుండి కోట్లనర్సింహులపల్లి, నందగిరి వరకు బిటి రోడ్డు మంజూరు చేయాలని, గ్రామంలోని తీవ్ర మంచినీటి సమస్య పరిష్కారానికి గాను మంచినీటి బావి నిర్మాణం, సిసి రోడ్డు కావాలని కోరగా మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కలువకోట కీర్తి కుమార్, మాజీ సర్పంచ్ తోట మల్లారెడ్డి, భాషుమియా, ఉపసర్పంచ్ రమేష్, జాకీర్ హుస్సేన్‌తో పాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌కు డబుల్ దమాకా..!
* కొత్తగా రెవెన్యూ డివిజన్
* మండలం ఏర్పాటు
* హన్మకొండలోకి హుజూరాబాద్ సబ్ డివిజన్
హుజూరాబాద్, ఆగస్టు 22: హుజూరాబాద్ సబ్ డివజిన్ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను కరీంనగర్ జిల్లా నుండి విడదీస్తూ కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మొదటి నుండి వరంగల్ జిల్లాలో హుజూరాబాద్ సబ్ డివిజన్ మండలాలు కలుస్తాయనే ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే వరంగల్ కాకుండా కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తూ అందులో ఈ మండలాలను చేర్చడంతో ఇన్ని రోజుల ఉత్కంఠకు తెరపడినట్లయింది. కాగా గత 30 ఏళ్లుగా హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ చేయాలనే కల ఫలించింది. కొత్త జిల్లాలతో పాటు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గత కొంత కాలంగా డివిజన్ ఏర్పాటుపై ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేయడంలో భాగంగా జమ్మికుంట మండలంలోని ఇల్లందకుంట గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ జిఓ జారీ చేయడంతో రెవెన్యూ డివిజన్, కొత్త మండలం, కొత్త జిల్లా ఏర్పడుతున్నట్లు గెజిట్ విడుదల కావడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చొరవ మేరకు ఇల్లందకుంట మండలంతో పాటు హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాబితాలో చోటు లభించినట్లయింది. మంత్రి సొంత మండలం కమలాపూర్ మండలం హన్మకొండలో విలీనం కావడంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హన్మకొండ జిల్లాలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఆరు మండలాలతో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. ఇల్లందకుంట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ మండలాలు ఈ డివిజన్ కిందికి వస్తాయి. గత కొంత కాలంగా ఏ జిల్లాలో కలుస్తుంది? అనే ఉత్కంఠకు నేటి ప్రకటనతో తెర దించినట్లయింది. స్వాతంత్య్రం వచ్చిన నుండి కరీంనగర్ జిల్లాతో కలిసి ఉన్న ప్రజలు ఇకముందు నుండి కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో కలుస్తుండడంతో పాటు రెవెన్యూ డివిజన్ అంత కొత్తగా ఇక్కడి ప్రజల్లో పాలన ఏర్పడనుంది.