కరీంనగర్

హుస్నాబాద్‌కు నష్టం చేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, ఆగస్టు 30: తెలంగాణ సాధనలో హుస్నాబాద్ ప్రాంతం కీలకమైన పాత్ర పోషించిందని, అలాంటి ఈప్రాంత ప్రజలకు నష్టం చేస్తే సహించేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించాలని కోరుతు చేపట్టిన దీక్ష మంగళవారానికి 4వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శంచి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల కాలంలో 69వేల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించాడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరించి కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎత్తును పెంచి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. పాలన సౌలభ్యం కోసం జిల్లా ఏర్పాటులో 25 జిల్లాలని ఒకసారి, 27 అని ఒకసారి సిఎం కెసిఆర్ తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని జిల్లాలను ముక్కలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇక్కడి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గంను మూడు ముక్కలు చేశారని దీనికి ఎమ్యెల్యే, ఎంపిలు జిల్లావాసులు కాకపోవడమే పాపమన్నారు. ఇప్పటికైన రెండు మండలాలను హుస్నాబాద్‌లో కొనసాగిస్తూ ఆర్‌డివో కార్యాలయం ఏర్పాటుకు కృషిచేయకుంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్ శివయ్య, వెంకట్, ఐలేని మల్లికార్జున్‌రెడ్డి, కోహెడ సృజన్, గడిపె మల్లేశ్, జెఎసి నాయకురాలు కె. సరోజన, శంకర్‌రెడ్డి, లింగరెడ్డి, అన్మిరెడ్డి, అక్కు శ్రీను, బొల్లి శ్రీను, వీరన్నయాదవ్, తదితరులు పాల్గొన్నారు.