కరీంనగర్

శరవేగంగా ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 12: మండలంలోని పెద్దకల్వల గ్రామ సమీపంలో గల ఎస్సారెస్పీ క్యాంపులో నూతనంగా ఏర్పడనున్న పెద్దపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. క్యాంపులోని అతిథి గృహం ఎస్పీ క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా అతిథి గృహం ఆధునీకరణ పనులను చేపడతున్నారు. ఇటీవల ఎస్సారెస్పీ క్యాంపును సందర్శించిన జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అక్టోబర్ 5వ తేదీ లోగా కార్యాలయాల ఏర్పాటు పూర్తి చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఇక్కడ కార్యాలయ ఏర్పాట్లను గోదావరిఖని ఎఎస్పీ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో స్థానిక సిఐ మహేష్, ఎస్సైలు శ్రీనివాస్, విజయేందర్ పర్యవేక్షణలో కొనపాగుతున్నాయి. నిర్ణీత గడువుకంటే ముందే కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వారు తెలిపారు. మొదల ఎస్పీ క్యాంపు కార్యాలయం పూర్తి చేసి, వెంటనే ఇతర కార్యాలయాల ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.