కరీంనగర్

ఫిలిప్పీన్స్ అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 28: ఫిలిపిన్స్ దేశానికి చెందిన విదేశీ అమ్మాయితో గోదావరిఖని పారిశ్రామిక పట్టణానికి చెందిన అబ్బాయతో హిందు సంప్రదాయ పద్ధతిలో వైభవంగా పెళ్ళి జరిగింది. ఫిలిపిన్స్‌కు చెందిన జైత డెబిస్ సల్పేరో, బొద్దుల మహేష్‌తో సోమవారం స్థానిక రాజ్యలక్ష్మి గార్డెన్‌లో జరిగింది. విదేశీ వధువు చీరలో తెలుగింటి ఆడ పడచులా ముస్తాబై ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన బొద్దుల మహేష్ ఉద్యోగరీత్య న్యూజిలాండ్‌లో అక్కడి ప్రైవేట్ టెలికాం కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఫిలిపిన్స్‌కు చెందిన జైత డెబిస్ సల్పేరో న్యూజిలాండ్‌లో నర్సు ట్రైనింగ్ కోసం శిక్షణ పొందుతుంది. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో న్యూజిలాండ్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్ళిన బొద్దుల మహేష్‌కు జైతాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్ళి కోసం జైత ఆమె తల్లిదండ్రులను సంప్రదించగా అంగీకరించారు. మహేష్ తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో సోమవారం ఇరువురికి భారతీయ హిందు సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి జరిగింది.