కరీంనగర్

నగరంలో పోలీసుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), సెప్టెంబర్ 13: నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం పేలుడు జరగడం, బక్రీద్ వేడుకలు ఉండడం, బుధవారం గణేష్ నిమజ్జన వేడుకలు ఉండడం నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు గాను నగర పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
జిల్లా కోర్టు, ఆవరణలో, పరిసరాల్లో, ఆర్టీసీ బస్టాండులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలి వేశారు. ఈ తనిఖీల్లో నగర సిఐలు కట్ట హరిప్రసాద్, విజయసారధితో పాటు పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.