కరీంనగర్

రైతులకు దేవాలయాలు వ్యవసాయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 23: రైతాంగానికి వ్యవసాయ మార్కెట్లు దేవాలయాల వంటివని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం జగిత్యాల ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణస్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ఎంపి కవిత ముఖ్యఅతిధగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పడిన తరువాత మార్కెట్ పాలకవర్గాల్లో మహిళలకు ప్రాతిని ధ్యం కల్పించిన ఘతన కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఇదివరకు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాలో అగ్ర, సంపన్న వ్యక్తులు మాత్రమే చైర్మన్లుగా కొనసాగారని తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల పాలక వర్గాలకు మహిళలకు, 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘ నత సిఎ కెసిఆర్‌కే దక్కుతుందని తెలిపారు. అలాగే మైనార్టీలకు అన్ని రం గాల్లో పెద్దపీట వేయాలని 50శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. ఈక్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీ వర్గాలకు చెందిన మహముద్ అలీకి చోటు కల్పించిందని తెలిపారు. ముఖ్యంగా నూతన పాలకవ ర్గం రైతులు, వ్యాపారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయ ంగా పనిచేయాలన్నారు. అలాగే మా ర్కెట్‌యార్డుల్లో మహిళ రైతులకు వస తి సౌకర్యాలు కల్పించాలని సూచించా రు. రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పె ట్టుకుని అన్ని మండలాల్లో గోదాంలు నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న తన్నీరు హరీష్‌రావు సంప్రదించి మార్కెట్ యార్డును అభివృద్ది చేసుకోవాలని పాలకవర్గానికి సూచించారు. ఉద్యమ ంలో క్రీయశీల కార్యకర్త పనిచేసిన శీలం ప్రవీణ్ సతిమణి ప్రియాంకకు అవకాశం కల్పించడంతో నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్ కృషి అభినందనీయమని తెలిపారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను విస్మరించకుండా పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపి కవిత తెలిపారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ శీలం వేణు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎఎంసి చైర్‌పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్, వైస్ చైర్మన్‌గా మోసిన్ డైరక్టర్‌లుగా బొడిగం మహేందర్‌రెడ్డి, గడ్డం రమణరెడ్డి, కచ్చు లత, దేవరశెట్టి జనార్థన్, రంగు వేణు తదితరులు ప్రమాణస్వీకారం చేసారు.

పెద్దపల్లి జిల్లాకు ‘కాకా’ పేరు..?

కరీంనగర్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో జిల్లాలో కొత్తగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఏర్పడుతుండగా, పెద్దపల్లి జిల్లాకు కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత మాజీ కేంద్ర మ ంత్రి జి.వెంకటస్వామి (కాకా) పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దళిత సామాజిక వర్గానికి చె ందిన వెంకటస్వామి సుదీర్ఘకాలం పెద్దపల్లి ప్రాంత ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా నూతన జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్‌ఉండగా, ప్రభుత వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకటస్వామి తనయుడు, మాజీ ఎంపి వివేక్ ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో కొనసాగుతుండడం, కాకా నామకరణంతో దళిత సా మాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవచ్చనే ఆలోచనతోనే పెద్దపల్లికి వెంకటస్వామి జిల్లాగా నామకరణం చేసేందుకు సి ఎం కెసిఆర్ సుముఖత వ్యక్తం చేసిన ట్లు తెలుస్తోంది. 1967 నుంచి మొదలుకొని వరుసగా లోక్‌సభ సభ్యునిగా ఎన్నికవుతూ వచ్చిన వెంకటస్వామి కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రిగా, పౌరసరఫరాలశాఖ మంత్రి గా, కేంద్ర కార్మిక శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గం నుండే ఆయన ఏడుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి అభివృద్ధిలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాకా తనదైన ముద్రవేసుకున్నారు. ఈ క్రమ ంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పెద్దపల్లికి కాకా పేరు పెట్టాలని స్థానిక ప్రజల నుంచి డిమాండ్ రాగా, ఈమేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రుద్రంగిని మండలంగా ప్రకటించాలని
భారీ రాస్తారోకో-్ధర్నా
* ఐదు గంటలపాటు నిలిచిన వాహనాలు

చందుర్తి, సెప్టెంబర్ 23: చందుర్తి మండలం మేజర్ గ్రామామైన రుద్రంగిని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ స్థానిక జెఎసీ నాయకులు గ్రామప్రజలతో కలిసి శుక్రవారం వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై ఐదు గంటలపాటు రాస్తారోకో-్ధర్నా చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్క డే నిలిచిపోయాయి. రాజన్న జిల్లా స మితి అడ్వకేట్ కన్వీనర్ పిట్టల భూ మేష్ అధ్వర్యంలో స్థానిక అఖిలపక్ష పార్టీల నాయకులు దీక్ష శిబిరంలో పా ల్గొని అనంతరం రుద్రంగిలో ప్రధాన రహదారి ధర్నా చేపట్టారు. రుద్రంగిని మండలంగా ప్రకటిస్తామని ఇప్పటివర కు ప్రభుత్వం స్పష్టమైన హామిని ప్రకటించకపోవడంతో రాస్తారోకో చేపట్టా రు. స్థానిక ఎమ్మెల్యే రమేష్‌బాబు రుద్రంగివైపు కనె్నత్తి చూడకుండా నెలరోజులుగా మండలం ఎర్పాటు కోసం దీక్షలు చేస్తున్న పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానిక టిఅర్‌ఎస్ నా యకులు ఎర్రం నర్సయ్య సైతం నెలరోజులు దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే స్పందించకపోవడం ఎంతవరకు స మంజసమాని పిట్టల భూమేష్ అన్నా రు. రుద్రంగిలో రాస్తారోకో జరుగుతు న్న విషయం తెలుసుకున్న ఎస్సై శివకేశవులు అక్కడికి చేరుకోగా వారు స్పందించకపోవడంతో వేములవాడ గ్రామీణా సీఐ మాధవి సర్కిల్ పరిధిలోని ఎస్సైలను తీసుకొని రుద్రంగికి చేరుకోని పరిస్థితిని అదుపు చేశారు. కాగా, దీక్షను విరమించకపోవడంతో సీఐ వారిపై అగ్రహం వ్యక్తం చేయగా కాసేపు ఇరువర్గాల మధ్య వాగ్వివదం జరిగింది. ఎమ్మెల్యే రుద్రంగిని మండలంగా ప్రకటిస్తామని హామి ఇచ్చేంతవరకు కదిలేదని పిట్టల భూమేష్, నాయకులు నంద్యాడపు వెంకటేష్, మాడిశేట్టి అభిలాష్, ఇప్ప మహేష్, ఆకుల గంగాధర్ తదితరులు బిష్మించుకొని అలాగే ఉండగా సీఐ జోక్యం చేసుకొని స్థానిక జడ్పీటీసీ అంబటి గంగాధర్‌తో ఫోనులో మాట్లాడించగా రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బోజ్జ నరేష్, బోజ్జ మహేందర్, బోడ్డు ప్రశాంత్, రేగుల రాజు, బొడ్డు దేవయ్య, నాయకులు పుప్పాల మోహన్, అంబటి శ్రీ్ధర్‌తోపాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.

మొక్కలు నాటండి.. సంరక్షించండి
* ఐతురాజుపల్లి టూరిజం స్థలంకు బాగుంటుంది
* జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

సుల్తానాబాద్, సెప్టెంబర్ 23: మొ క్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు అందరు బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఐతురాజుపల్లి మైసమ్మ గుట్ట వద్ద నాటిన పలురకాల పండ్ల మొక్కలను, పూల మొక్కలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ మొక్కలను ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ గుట్టవద్ద టూరిజం స్థలంగా బా గుంటుందని, టూరిజం డెవలప్‌మెం టు ఆఫీసర్‌ను పంపి సర్వే చేపిస్తామన్నారు. గార్డెన్, వాటర్ సౌకర్యం, ఇతర ఏర్పాట్లుచేస్తే ఈ గుట్ట టూరిజం స్థలం కు ఎంతో బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డ్వామా పిడి వెంకటేశ్వర్ రావు, ఆర్‌డిఓ అశోక్ కుమార్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ వినోద్, సర్పంచ్ లావణ్య, ఎంపిటిసి ధీకొండ భూమేష్‌తో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్యానికి అత్యధిక నిధులు
* ఎమ్మెల్యే బొడిగ శోభ

చొప్పదండి, సెప్టెంబర్ 23: రాష్ట్రం లో వైద్య, ఆరోగ్యశాఖను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ పేర్కొన్నారు. శుక్రవారం చొప్పద ండి మండల పరిధిలోని చిట్యాలపల్లి లో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనాన్ని ఎ మ్మెల్యే ప్రారంభించారు. అలాగే చొప్పదండిలో సిసి రోడ్డు, ఆర్నకొండలో అ ంబేద్కర్ కమ్యూనిటి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఆరోగ్య శాఖపై దృష్టి సారించలేదని ఫలితంగా అనేకమంది ప్రభుత్వ వైద్యసేవలను వినియోగించుకోలేకపోయారని తెలిపారు. అందుకే మెరుగైన వై ద్యంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు, కనీస వసతు లు, ఉన్నత వైద్యసేవలు అందించేందు కు కావాల్సిన పరిసరాలను ఏర్పాటు చే యటం జరిగిందని చెప్పారు. రాష్ట్రం లో ఉన్నత ఆసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రుల స్థాయిలో తీర్చదిద్దడం జ రుగుతుందని తద్వారా ఖరీదైన వై ద్యాన్ని నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వినియోగించుకోవడానికి అ వకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి గుర్రం భూంరెడ్డి, మాజీ ఎంపిపి వెల్మ మల్లారెడ్డి, ఎంపిటిసిలు ఎలిగేటి తిరుపతి, చీకట్ల రాజశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు మంద నర్సయ్య, సర్పంచ్‌లు శంకర్, ఎన్నం మనోహర్, కర్రె శ్రీనివాస్, నాయకులు సీపెల్లి గంగయ్య, నలుమాచు రామకృ ష్ణ, బందారపు అజయ్‌కుమార్, మాచ ర్ల వినయ్‌కుమార్, గొల్లపల్లి శ్రవణ్, కొ త్త గంగారెడ్డి, సుద్దాల శ్రీనివాస్, చీకట్ల లచ్చయ్యలతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.