కరీంనగర్

ముంచెత్తిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 25: నిర్మాణ దశలో ఉన్న మిడ్‌మానేర్ ప్రాజెక్టును వరద ముంచెత్తింది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆదివారం సాయంత్రానికి కల్లా ఉగ్రరూపం దాల్చి..చివరకు రాత్రి సమయాన ప్రాజెక్టుకు గండి పడింది. నిర్మాణం పూర్తికాకపోయినప్పటికీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 3టిఎంసిల నీటిని ప్రాజెక్టులో నిలువ ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధపడగా, ఊహించని ఈ ఉత్పాదం అటు అధికారులను అయోమయానికి గురిచేయగా, ఇటు ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఎగువ మానేరు, మూలవాగులతోపాటు పలు చెరువుల నుంచి లక్షా 80వేల క్యూసెక్కుల వరద నీరు ఆకస్మికంగా చేరడం, స్పిల్‌వే పై నుండి వరద ఉదృతి కొనసాగడంతోపాటు అటు 115మీటర్ల పొడవునా మట్టి (కర) కట్టపై వరద పారింది. వరద తాకిడికి మట్టికట్ట మెల్లమెల్లగా కోతకు గురై చివరకు గండి పడింది. గండిపడకముందే వరద తాకిడికి కొదురుపాక, నీలోజిపల్లి, మల్లాపూర్, మాన్వాడ గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోగా, చీర్లవంచ, రుద్రవరం, చింతలఠాణా గ్రామాలు కొంతమేర వరదలో చిక్కుకున్నాయి. నీలోజిపల్లిలో 750, కొదురుపాకలో 1350, మల్లాపూర్, మాన్వాడలో 500కుపైగా కుటుంబాలుండగా, వారందరిని అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో తట్టబుట్ట, పిల్లాపాపను సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మిడ్‌మానేర్‌కు గండిపడిన నేపథ్యంలో మిడ్‌మానేర్ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో సైతం హై అలర్ట్ ప్రకటించారు. పరివాహక ప్రాంతమైన ఎలగందుల, ఖాజీపూర్, కమాన్‌పూర్, చింతకుంట, పొత్తూరు, చొక్కారావుపల్లి, షాభాష్‌పల్లి ఈ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వాగు సమీపంలో ఉన్న ఇండ్లల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిడ్‌మానేర్‌ను మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లు సందర్శించి వరదను పరిశీలించారు. మాన్వాడలో మంత్రులను ముంపు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. అధికారులు ముందుగా చెప్పకుండా తమను కట్టుబట్టలతో ఖాళీ చేయించారంటూ ఆందోళనకు దిగారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వరద పరిస్థితి ఎప్పటికప్పుడు భేరీజు వేసుకుంటూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్‌లు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. మిడ్‌మానేర్ పరిస్థితి ఇలా ఉంటే, భారీ వర్షాలతో మానేరు, మోయతుమ్మెద, ఎల్లమ్మ, మూల, బిక్క వాగులు ఉరకలేస్తున్నాయి. ఎల్‌ఎండిలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శభాష్‌పల్లి వంతెన నీట మునగడంతో కరీంనగర్-సిరిసిల్లకు రాకపోకలు నిలిచిపోగా, బోయినపల్లి మీదుగా వాహనాలను దారి మళ్లీంచారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎస్సారెస్పీ నుంచి నీరు వస్తుండటంతో ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతాల్లో, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో గోదారి తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వానల ధాటికి జిల్లాలో వందలాది హెక్టార్లలో పంట దెబ్బతింది. కాగా, ఆదివారం జిల్లాలో భారీగా వర్షం కురిసింది. జిల్లాలో 57 మండలాలుండగా, అత్యధికంగా ఎల్లారెడ్డిపేట 21.8, గంభీరావుపేట 14.0, ముస్తాబాద్, ఓదెల, మల్యాల మండలాల్లో 11సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగితా మండలాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలో మొత్తం 2933.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కాగా, సగటున 51.5మిల్లీమీటర్లు నమోదైంది.