కరీంనగర్

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 27: వెనుకబడిన తరగతుల ప్రజల అభివృద్ధికి ప్ర భుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నా రు. మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్‌లో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి ఉ త్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ముందుగా మంత్రితోపాటు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వొడితెల సతీష్‌కుమార్, మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానీయుల జయంతి ఉ త్సవాలు జరుపుకోవడంవల్ల వారి సేవలను స్మరించుకుంటూ యువత వారి అడుగుజాడల్లో నడుస్తుందన్నారు. కొ ండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొ నసాగించాలన్నారు. ప్రత్యేక రాష్ట్రంతో నే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయని మంత్రి పదవికే రాజనా మా చేసిన మహానీయుడు కొండా ల క్ష్మణ్ అని కొనియాడారు. 98 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ కోసం ఉద్యమం చేసిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. చే నేత కార్మికుల బతుకులు బాగుపడాల ని, వారి సంక్షేమానికి ఎంతో కృషిచేశారని తెలిపారు. అలాంటి మహానీయు డి పేరును నగరంలోని నాలుగు వరస ల రింగ్‌రోడ్డుకు కొండా లక్ష్మణ్ రోడ్డు గా నామకరణంచేసి బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నగర ప్రవేశం నుండి కమాన్ వరకు సావిత్రిబాయి పూలె రో డ్డుగా నామకరణం చేసి బోర్డులు పెట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత, బీడి కార్మికులకు అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి కృషిచేస్తుందన్నా రు. చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 13.41 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ నగర ప్రజలకు తా గునీటి ఇబ్బందులు లేకుండా ప్రతిరో జు నల్లానీరు సరఫరా చేస్తామన్నారు. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసిన నే పథ్యంలో ఎల్‌ఎండి నీటితో నిండింద ని, నగర ప్రజలకు తాగునీటికి కొదవ లేదన్నారు. పెద్దపల్లి ఎంపి బాల్క సు మన్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బా పూజీ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషిచేసిన మహానీయుడు అని కొనియాడారు. వారి ఆశయాలను నిజం చేసేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజలకు దిక్సూచి, మార్గదర్శి అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ చరిత్రను అందరు తెలుసుకోవాలని, వారి చరిత్రను భావితరాలకు అందించాలని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారని, వారి ఆశయాలకనుగుణంగా అందరు నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ గుగ్గిల్లపు రమేష్, ఎజెసి నాగేంద్ర, కార్పోరేటర్లు కట్ల విద్య, రూప్‌సింగ్, గూడూరి మురళి, నాయకులు నర్సయ్య, మెతుకు సత్యంలతోపాటు పలువురు పాల్గొన్నారు.