కరీంనగర్

గోదావరిఖనిలో డిఐజి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 9: కొత్త మంజూరైన పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గోదావరిఖనిలో ఆదివారం సాయంత్రం వరంగల్ రేంజ్ డిఐజి రవి వర్మ పర్యటించారు. కొత్తగా మంజూరైన పోలీస్ కమీషన రేట్ ఏర్పాటుకు సంబంధించి పోలీస్ హెడ్ క్వార్టర్ స్థలాన్ని కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి రవి వర్మ గోదావరిఖని సబ్ డివిజన్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధులను కలుపుతూ గోదావరిఖనిలో పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు చేస్తున్నారు. కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాలకు ఒక్కొ డిసిపి, పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరిఖని, బెల్లంపల్లి, జైపూర్ డివిజన్లకు ఒక్కొ ఎసిపిని నియమించనున్నారు. లా అండ్ అర్డర్, ఇతర విభాగాలకు సంబంధించి ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగిన్నట్లు తెలుస్తుంది. సింగరేణి బొగ్గు పరిశ్రమలు, ఎన్టీపీసీ, జైపూర్ థర్మల్ స్టేషన్ జెన్‌కో విద్యుత్ కేంద్రాలు, సిమెంట్ కర్మాగారాలు, ఇతర పరిశ్రమలతో నిండున్న పారిశ్రామిక ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో దీనికి అనువుగా గోదావరిఖనిని ప్రధాన కేంద్రంగా చేసుకొని కార్యాలయంను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో కొంత కాలంగా విచ్చల విడిగా కొనసాగుతున్న భూ మాఫియా, వైట్ కాలర్ నేరాలు, రౌడీయిజం, ఇతర అసాంఘిక కార్యకలపాలకు కమీషనరేట్‌తో పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఐజి అధికారి పర్యవేక్షణలో నిఘా కొనసాగుతుంది. తరుచుగా ఈ ప్రాంతంలో పెరుగుతున్న నేరాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గు ముఖం పట్టనుంది. కొత్తగా కమీషనరేట్ పరిధిలో అంతర్గాం, రత్నాపూర్‌లో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రాంతంలో ఈ కమీషనరేట్ పరిధిలో మరో మూడు సర్కిల్ పోలీస్ స్టేషన్లు ఏర్పడే అవకాశముంది. కొత్తగా ప్రారంభం కాబోతున్న కమీషనరేట్‌కు సంబంధించి మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమీషనరేట్ చాంబర్‌తోపాటు కార్యాలయంలోని వివిధ విభాగాల ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతమున్న పోలీస్ హెడ్ క్వార్టర్‌లోని కార్యాలయంలో చేపట్టాల్సిన పనులను సూచించారు. ఇది ఇలా ఉండగా దసరా పండుగ రోజున కమీషనరేట్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుండగా రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ, లేదా ఎజిపి అంజన్ కుమార్ చేతుల మీదుగా గోదావరిఖని కమీషనరేట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఆయన వెంట జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, గోదావరిఖని సబ్ డివిజన్ ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌తోపాటు గోదావరిఖని వన్‌టౌన్, టూటౌన్, రామగుండం, మంథని, సిఐలు ఎ.వెంకటేశ్వర్, వాసు దేవా రావు, ప్రభాకర్‌తోపాటు పలువురు ఉన్నారు.