కరీంనగర్

మరోమారు అఖిలపక్ష సమావేశం ఏమైంది...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 10: జిల్లాల విభజనకు సంబంధించి తుదినిర్ణయం తీసుకునేముందు మరోమారు అఖిలపక్ష స మావేశం నిర్వహించి అభిప్రాయాలు తీ సుకుంటామని ప్రకటించిన సిఎం కెసిఆ ర్ ఏకపక్షంగా తుది జాబితా విడుదల చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దు ద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు ఆరోపించారు. పాలన సులభతరమవుతుందంటూ రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన జిల్లాల విభజనలో శాస్ర్తియత, పారదర్శకత లోపించిందని, ఫలితంగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవన్నారు. సోమవారం మధ్యాహ్నం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొ త్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని, అయితే శాస్ర్తియత లోపించడ ంవల్లే జిల్లాల విభజనకు సంబంధించి విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేయటం తప్పా అని ప్రశ్నించారు. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా జనాభా ఉందని, అసలు ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ఉన్నది ఉన్నట్లుగా బహిర్గ తం చేస్తుంటే ఉలికిపడుతూ అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న అసంబద్ద విధానాలను ఎ ప్పటికప్పుడు ఎండగడుతుంటే జీర్ణించుకోలేని అధికార నేతలు కక్షసాధింపుధోరణిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాకాంక్షకనుగుణంగా పాలన కొనసాగిస్తామని చెప్పిన సిఎం ఇందుకు విరుద్ద ంగా వ్యవహరిస్తూ, వారి ఆశలపై నీళ్ళు చల్లుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల మనోభావాల మేరకే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పా టు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సిఎం మంథని కేంద్రంగా జిల్లాను చేయాలని రోజుల తరబడి ఆ ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేసినా పరిగణనలోకి తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. డివిజ న్ కేంద్రంగా అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులతో కొనసాగుతున్న మంథని పై చిన్నచూపు చూడడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనమేమిటో ఆ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని తెలిపా రు. తమ అధినేత సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరితే, దీనిని విస్మరించి కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని మండిపడ్డారు. సిఎం అనాలోచిత నిర్ణయాలతో 10 జిల్లాల్లోని ఉ ద్యోగులు అయోమయానికి గురవుతున్నారని, వీరి విభజనలో సైతం పారదర్శకత లోపించటమే ఇందుకు కారణమని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనాపర ంగా ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయన్నారు. పలు ప్రభుత్వ శాఖల విలీనంతో ఓవైపు ఉద్యోగులను కుదించే యత్నం చేస్తూనే, మరోవైపు కొత్త ఉద్యోగాలంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ పక్కదారి పట్టించటంపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నుంచి గట్టెక్కేందుకే జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టారని శ్రీ్ధర్‌బాబు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మాజీ విఫ్ ఆరెప ల్లి మోహన్, నాయకులు కోమటిరెడ్డి నరే ందర్‌రెడ్డి, శశిభూషన్‌కాచే, గందె మా ధవి, అజిత్‌రావు, ఆమ ఆనంద్, అంజన్‌కుమార్, గందె మహేష్, పోతారపు సు రేందర్ తదితరులు పాల్గొన్నారు.

సర్వం సిద్ధం...!

* నేటి నుంచి ‘కొత్త’ పాలన షురూ
* ఎట్టకేలకు కుదిరిన ముహూర్తం
* 11:11 నుంచి 12:20 గంటలలోపు
* మంత్రులచే నయా జిల్లాల ప్రారంభం
* అనంతరం కలెక్టర్లు, ఎస్పీల బాధ్యతల స్వీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, అక్టోబర్ 10: ‘కొత్త’ పాలనకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో నయా జిల్లాలు ప్రారంభం కానున్నాయి. దసరా పర్వదినంవేళ కొత్త ఆఫీసుల ప్రారంభోత్సవానికి ము హుర్తం కుదిరింది. మంగళవారం ఉ దయం 11:11 గంటల నుంచి మధ్యా హ్నం 12:20 గంటలలోపు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పడబోతున్న పెద్దపల్లి జిల్లాను రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్, సిరిసిల్ల జిల్లాను మంత్రి కెటిఆర్, జగిత్యాల జిల్లాను ఉపముఖ్యమంత్రి మ హమూద్ అలీ ప్రారంభించనున్నారు. అటు కరీంనగర్, రామగుండం (గోదావరిఖని) పోలీసు కమీషనరేట్లను కూడా రాష్టస్థ్రాయి పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. ఈ ప్రా రంభోత్సవంలో ఆయా ప్రాంతాల ఎ ంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రారంభోత్సవాల అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలను స్వీకరించనున్నారు. తదుపరి బహిరంగ సభలను నిర్వహించి ప్రజలనుద్దేశించి మంత్రులు ప్రసంగించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వు లు అందించింది. ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు మంగళవా రం ఉదయం విధుల్లో చేరనున్నారు. హాజరు పట్టికలో సైతం తొలి సంతకాలు చేయనున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ఉత్తర్వులు విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా సర్పరాజ్ అహ్మద్, జెసిగా వీరబ్రహ్మయ్య, సిరిసిల్ల (రాజన్న) జిల్లా కలెక్టర్‌గా కృష్ణ్భాస్కర్, జెసిగా షేక్ యామిన్‌పాషా, జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా ఎ.శరత్, జెసిగా ఎ.నాగేంద్ర, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా అలుగు వర్షిణీ, జెసిగా ప్రభాకర్ రెడ్డిలు నియమితులు కాగా, సిరిసిల్ల ఎస్పీగా విశ్వజిత్, కరీంనగర్ పోలీసు కమీషనర్‌గా కమలహాసన్‌రెడ్డి, రామగుండం (గోదావరిఖని) పోలీసు కమీషనర్‌గా విక్రమ్‌జిత్ దుగ్గల్, జగిత్యాల ఎస్పీగా అనంత్ శర్మ నియమితులయ్యారు. అలాగే అన్ని శాఖల జిల్లా అధికారులను నియమించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన నీతూప్రసాద్ హైదరాబాద్‌కు, జెసి శ్రీదేవసేన జనగామకు, ఎస్పీగా పనిచేసిన జోయల్ డేవిస్ కామారెడ్డికి, గోదావరిఖని ఎఎస్పీ విష్ణ ఎస్ వారియర్ నిర్మల్‌కు బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు, ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఇప్పటివరకు కలిసి ఉన్న గత స్మృతులను నెమరువేసుకుంటూ ఆత్మీయతను పంచుకున్నారు.

కరీంనగర్ జిల్లా ప్రజలు ఆత్మీయులు..!
* కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 10: కరీంనగర్ జిల్లా ప్రజలు ఆత్మీయులని, చా లా మంచివారని, ఈ జి ల్లాలో పనిచేయడం ఎం తో సంతృప్తినిచ్చిందని కలెక్టర్ నీతూప్రసాద్ అ న్నారు. అందరి సహకార ంతో జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రస్థానం లో నిలుపుటకు కృషి చేశానని తెలిపారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా అధికారులు వివిధ జిల్లాలకు బదిలీ అయిన సందర్భంగా సోమవారం సా యంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అధికారుల ఆత్మీయ వీ డ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎక్కడ ప నిచేసినా కరీంనగర్ అనుబంధం కొనసాగుతుందని తెలిపారు. కరీంనగర్‌లో గోదావరి పుష్కరాలను అధికారులందరు బాగా పనిచేసి విజయవంతం చేశారని కొనియాడారు. జిల్లాలో అధికారులకు చెప్పిన పని తూచ.తప్పకుండా వెంటనే చేసేవారని, ఫైళ్లు కూడా క్రమపద్ధతిలో సమర్పించేవారని, అధికారులందరు ఒక కుటుంబంలాగా టీం వర్క్‌గా పని చేశారని, కార్యాలయాలలో ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు సంతోషంగా, ఇష్టంగా పనిచేయాలన్నారు. అధికారులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. వివిధ జిల్లాలకు బదిలీపై వెళ్తున్న జిల్లా అధికారులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ శ్రీదేవసేన, ఎజెసి నాగేంద్ర, డిఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, హౌజింగ్ పిడి నర్సింహారావు, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, జడ్పీసిఇఓ సూ రజ్‌కుమార్, డిఇఓ శ్రీనివాసాచారితోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

శంకర్‌రెడ్డి నియామకం పట్ల హర్షం
ముస్తాబాద్, అక్టోబర్ 10: ఈద శంకర్‌రెడ్డి ఇరిగేషన్ డవలప్‌మెంట్ చైర్మన్ గా నియామకం అవడంపట్ల ఆదివారం ముస్తాబాద్ సహకార సొసైటీ చైర్మన్ కనెమేని చక్రధర్‌రెడ్డి, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల అభివృద్ధి కోసం కృషిచేస్తారని ఆకాంక్షించారు.
‘కొత్త’ సంబరాలను విజయవంతం చేయాలి
* జడీ పటిసి సభ్యుడు ఆగయ్య
ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 10: కొత్తగా ఏర్పడిన సిరిసిల్ల(రాజన్న) జిల్లాను ద సరా పండుగరోజున మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చి సంబరాలను విజయవంతం చేయాలని జడ్పిటిసి సభ్యుడు ఆగయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాట్లాడారు. జిల్లాను ప్రకటించిన సిఎం కెసిఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి సాధనకు కృషిచేసిన మంత్రి కెటిఆర్, ఎంపి వినోద్‌కుమా ర్, టెస్కాబ్ అధ్యక్షుడు రవీందర్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల జి ల్లా మంత్రి కెటిఆర్ ఆధ్వర్యనా తెలంగాణలోనే సిరిశాలగా మారుతుందన్నా రు. నూతనంగా ఏర్పడిన వీర్నపల్లి మండలంతోపాటు ఎల్లారెడ్డిపేటల అభివృ ద్ధి మరింత జరుగనుందన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ సర్కిల్ కార్యాలయం, వీ ర్నపల్లి మండల తహసిల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ప్రా రంభించనున్నామన్నారు. అన్ని గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చి మంత్రి కెటిఆర్‌కు ఘనస్వాగతం పలకాలని ఆగయ్య కోరారు. మార్కెటు కమి టీ అధ్యక్షుడు సుభాష్, ప్రజాప్రతినిధులు లక్ష్మన్‌రావు, నర్సింహారెడ్డి, బాలకిషన్, నాయకులు మోహన్, రమేశ్, దేవిరెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజం, శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లయ్య, కృష్ణహరి, జగన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కార్యాలయాల సైన్‌బోర్డులపై జిల్లా పేరు మార్పు
ముస్తాబాద్, అక్టోబర్ 10: ఈనెల 11న తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా జిల్లాల ఏర్పాటు జరుగనుండటంతో, ముస్తాబాద్ మండల ప్రభుత్వ కార్యాలయాల సైన్‌బోర్డులపై జిల్లా కరీంనగర్ స్థానంలో సిరిసిల్ల జిల్లా పేరును మార్చడంలో యంత్రాంగం నిమగ్నమయ్యారు. మండలంలోని అన్ని కార్యాలయాల్లో సిరిసి ల్ల జిల్లా పేరును దిద్దుతున్నారు.
ఉద్యమంతోనే సిరిసిల్ల జిల్లా
* అఖిలపక్షం నాయకులు
ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 10: అఖిలపక్షం నాయకులు, ప్రజలు, న్యాయవాదు ల 50 రోజుల ఉద్యమంతోనే సిరిసిల్ల జిల్లా ఏర్పడిందని అఖిలపక్షం నాయకులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. జిల్లా సాధన కోసం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని సోమవారం తొలగించారు. నర్సయ్య మాట్లాడుతూ జిల్లా కోసం మడమతిప్పని పోరాటం చేసిన మాదిరిగానే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలను ఎండగడతామనా నరు. ప్రజా సంక్షేమానికి పాటుపడాలన్నారు. జిల్లా సాధనకు సహకరించిన అ ందరికి నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు పర్శరాములు, నారాయణగౌడ్, బాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట నూతన సిఐగా రవీందర్
* వీర్నపల్లి తహసీల్దార్ అలీమొద్దిన్
ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 10: దసరా పండుగ రోజు మంగళవారం ప్రారంభం కానున్న ఎల్లారెడ్డిపేట మండల పోలీస్ సర్కిల్ కార్యాలయం, వీర్నపల్లి మం డల తహసీల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ భవనాలు రంగులతో కళకళలాడుతున్నాయి. కొత్త శోభను సంతరించుకున్నాయి. ఎల్లారెడ్డిపేటతోపాటు వీర్నపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. నూతన సీఐగా కరీంనగర్ జిల్లాలోని ఆదిలాబాద్ విభాగం సిఐడిలో పనిచేసిన రవీందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వీర్నపల్లి తహసీల్దార్‌గా జిల్లా సచివాలయంలో పనిచేసిన అలిమోద్దిన్ ను నియమించారు. శిక్షణ ఎస్‌ఐ నరేశ్ వీర్నపల్లి ఎస్‌ఐగా విధుల్లో చేరనున్నారు. ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్న షెమి వీర్నపల్లికి ఆర్‌ఐగా వెళుతున్నారు.
చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 10: ఎల్లారెడ్డిపేట మండలం పదిర, వెంకటాపూర్‌లో ని భారతీయ జనతాపార్టీ జెండా, ఫ్లెక్సీని చింపివేసిన వ్యక్తుల గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్, పది ర గ్రామ వాసి కంచర్ల పర్శరాములు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటాపూర్‌లో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కట్టిన ఫ్లెక్సీని గుర్తుతెలియనివ్యక్తులు చింపివేశారని అందులో పేర్కొన్నారు. పదిరలో పార్టీ జెండాను ఎత్తుకెళ్లారని పొందుపరిచారు. చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పర్శరాములు పోలీసులను కోరారు.
కన్నుల పండువగా తెప్పోత్సవం
వేములవాడ, అక్టోబర్ 10: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల భాగంగా సోమవారం పదోరోజూ రాత్రి హంసవాహనంపై శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీఅనంత పద్మనాభస్వామివార్లు విహరించారు. ఈ సుందరమైన దృశ్యాన్ని ప్రజలు తిలకించి భక్త్భివ పారవశ్యాన్ని పొందారు.