కరీంనగర్

దేశంలోని అధికారులు తెలంగాణపైనే చర్చించుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంథని, అక్టోబర్ 21: తెలంగాణ ఏర్పడిన తదుపరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిపైన, పోలీస్ వ్యవస్థ పైనే దేశంలోని ఉన్నత అధికారులు తెలంగాణపైనే చర్చ కోనసాగిస్తున్నారని రామగుండం పోలీస్ కమీషన్‌ర్ విక్రం జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా మంథనిలో నిర్మించిన పోలీస్ అమరవీరుల స్థుపాన్ని ఆయన మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి డిసిపి విజయేంధర్ రెడ్డిలతో ప్రారంభించారు. ఈసందర్బంగా సిపి దుగ్గల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి 40 లక్షల ఎక్సిగ్రేషియా ప్రకటించిందన్నా రు. పోలీసులు ప్రజలకు అందుబాటు లో ఉండేందుకు జనమైత్రిని ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ కమీషనరేట్ దగ్గర ఉండటంతో ప్రతివ్యక్తి కి పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి కర్ర విజయేంధర్‌రెడ్డి, మంథని సిఐ ప్రభాకర్‌తోపాటు ఎంపిపి ఏగోలపు క మల, జడ్పిటిసి సరోజన, మార్కేట్‌కమిటి అద్యక్షుడు కిరణ్, వైస్ ఎంపిపి గట్టయ్య, తదితరులు పాల్గోన్నారు.