కరీంనగర్

అధ్యాపక ఖాళీలను భర్తీచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలోని 68 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 ఏళ్ల నుండి బోధన బోధనేతర సిబ్బంది పోస్టు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరగా భర్తీచేయాలని సిద్ధిపేట జిల్లా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఉపాధ్యక్షుడు కోతి యాదగిరి అన్నారు. శుక్రవారం కోహెడలో విలేఖరులతో మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం త్వరగా స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈయన వెంట సంఘం నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రాజవౌళి, సీతారామయ్య, రజిత, నీరజ తదితరులు ఉన్నారు.
నలుగురికి గాయాలు
సైదాపూర్, నవంబర్ 4: మండలంలోని ఎలబోతారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్కలు దాడి చేయగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా నమిండ్ల శే్వతను వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ములుగు వినిత, మాడుగుల నైసిలు, ముడుపు ప్రశాంత్ హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్కల బారి నుండి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే మండలంలోని వెన్నంపల్లి, దుద్దెనపల్లి, గొడిశాల, జాగీరుపల్లి తదితర గ్రామాలలో పిచ్చికుక్కల స్వైరవిహారం, కోతుల బె డద ఉండడంతో గ్రామస్థులు వాటిబారినుండి కాపాడాలని కోరుతున్నారు. అ ధికారులు స్పందించి కోతులు, కుక్కలబారినుండి కాపాడాలనికోరుతున్నారు.