కరీంనగర్

భక్తుల సౌకర్యార్థమే బస్టాండ్ మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, డిసెంబర్ 12 : వేములవాడ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తిప్పాపూర్‌లోని 4 ఎకరాల స్థలం గురించి ప్రతిపాదనలు పంపించామని, అభివృద్ధిని స్వాగతించాలే కానీ రాజకీయం చేయడం తగదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతు భక్తులకు, ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని జగిత్యాల బస్టాండ్ (కట్టకింద) సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని సేకరించి యత్నాల్లో ఉన్నామని, ఇక్కడ బస్టాండ్ నిర్మాణం, వసతిగృహం నిర్మించాలని ప్రతిపాదనలు చేస్తున్నామని, ఇది భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుందన ఆయన అన్నారు.

నిర్ధేశిత ప్రాంతంలోనే ఆసుపత్రి నిర్మించాలి
* అభివృద్ధికి మేము అడ్డంకి కాదు: మాజీ ఆలయ చైర్మన్ ఆది శ్రీనివాస్

వేములవాడ, డిసెంబర్ 12 : వేములవాడ పట్టణంలో నిర్మించే 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని తిప్పాపూర్‌లోని దేవాలయ భూమిలో చేపట్టవద్దని, గతంలో పేర్కొన్న సేవ్స్‌కు చెందిన 3 ఏకరాల్లో చేపట్టాలని రాజన్న కోవెల మాజీ చైర్మన్, బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పట్టణంలోని పలువురు కౌన్సిలర్లు, బిజెపి నేతలతో కలిసి ఆలయ ఇవో దూస రాజేశ్వర్‌కు శనివారం ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతు గతంలో వేములవాడ మండల పరిషత్ ఆవరణంలో అప్పటి పంచాయతీరాజ్,వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిచే ఇండోజర్మనీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.8.59 కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఇందు కొరకు మరసటి మాసంలోనే సేవ్స్ పేరిట 3 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని ప్రస్తుతం ఇక్కడ కాకుండా ఆలయానికి చెందిన తిప్పాపూర్‌లోని 5 ఎకరాల స్థలంలో ఆసుపత్రి భవనాన్ని రూ.22 కోట్లతో నిర్మిస్తామని ఇటీవలికాలంలో పత్రికలలో ప్రకటనలు రావడం పట్ల తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే తిప్పాపూర్‌లోని ఆలయ భూమి 13 ఎకరాల్లో టూరిజంశాఖ గెస్ట్‌హౌజ్, హోటల్ నిర్మించారని, కొంత స్థలాన్ని భక్తుల కొరకు నక్షత్రవనం, నవగ్రహవనం తదితర ఔషధ, పూలమొక్కల కొరకు వదలిపెట్టారని ఇదే స్థలంలో మిగిలిన భూమిలో ఆసుపత్రి నిర్మాణం చేసిన పక్షంలో పవిత్రత దెబ్బ తింటుందని, దీనిని గతంలోనే తాము తహశీల్‌దార్‌కు వినతిపత్రం సమర్పించామని, ప్రస్తుతం రాష్టద్రేవాదయశాఖ కమీషనర్ ఇతర ముఖ్య అధికారుల దృష్టికి తీసుకువెళతామని, ఇవో సైతం ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా అధికారులకు విన్నవించాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తాము అభివృద్ధికి అడ్డం కాదని, బస్‌స్టేషన్‌ను సైతం తిప్పాపూర్ నుండి తరలించవద్దని, అక్కడ కూడా ఆసుపత్రి నిర్మాణం కూడదని, గతంలో నిర్ధేశించిన సేవ్స్ స్థలంలోనే నిర్మించాలని, ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ వేములవాడ దేవాలయాన్ని సందర్శించి ఏడాదికి రూ. 100 కోట్లు, నాలుగేళ్లలలో 400 కోట్లు ఆలయ అభివృద్ధికి ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికి ఆరుమాసాలు గడిచినా, మూడు కేబినెట్ సమావేశాలు జరిగిన నిధులు రాలేదని, ఇంక ఎప్పుడు నిధులను విడుదల చేస్తారని ఆది ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, గన్నమనేని రామారావు, తూం మధు, కూరగాయల శ్రీనివాస్, జంగం రాజేందర్, కోఆప్షన్ సభ్యులు కూరగాయల శ్రీశైలం, మండల బిజెపి అధ్యక్షులు బండ మల్లేశం, బిజెపి నేతలు పెంట నరేశ్, రేగుల మల్లిక్, సంగె స్వామి, సంద్రగిరి శ్రీనివాస్ తదితర నేతలతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.