కరీంనగర్

కెసిఆర్ అన్నిట్లో నెంబర్ వనే్న...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, నవంబర్ 8: తెలంగా ణ ఉద్యమం ప్రారంభించిన నాటినుం డి తెలంగాణ సాధించుకొనేవరకు నిరంతరంగా ప్రాణాన్ని ఫణంగా పెట్టింది కేసిఆర్ అనే పేర్కొంటూ మతిలేని మాటలు, అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, తెలంగాణ అభివృద్ధికి తమవంతుగా సహకరించాలని మానకొండూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రతిపక్షాల వారిని కోరారు. మంగళవారం తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ గ్రామంలోగల మానకొండూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రతిపక్ష నాయకులు మతిస్థిమితం కోతుళ్లా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. కేసిఆర్ ఎందులో నెంబర్ వన్ అని చిన్న పిల్లవాన్ని అడిగినా దేశంలోనే నెంబర్ కేసిఆర్ అని చెబుతారన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాన్ని పనంగా పెట్టింది కేసిఆర్ కాదా అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ను ప్రశ్నించారు. రైతులమీద నరహంతక చర్య లు తీసుకున్న చంద్రబాబు హ యాంలో డిప్యూటి స్పీకర్‌గా వ్యవహరి ంచిన కేసిఆర్ పదవిని వదులుకోలేదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయా ంలో ఏ గ్రామంలోని చెరువులు, కుంటల్లో చెట్లు, తుమ్మలు పెరిగి ఉన్నా ఆంధ్ర పాలకుల అడుగులకు మడుగులొత్తి పిడికెడు మట్టినైనా తీశారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలలో అత్యధికంగా చెరువుల్లో పూటిక తీవడంతో నెంబర్ వన్, మూడు సంవత్సరాల ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ చెల్లించడం, రైతులకు ఇంపుట్ సబ్సిడీ ఇవ్వడం, ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి విషయంలో కేసిఆర్ ముందున్నాడన్నారు. రైతుల రుణ మాఫీలో కేవలం 4వేల కోట్లు మాత్రమే బకాయి ఉందన్నారు. మానకొండూర్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 286కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయించి, ఖర్చు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా అసంపూర్తిగా ఉన్న భవనాలే కనిచాయని, వాటిని పూర్తిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లను పిలిచి తామే పూర్తి చేయించామన్నారు. మానకొండూర్ చెరువు, షాదీఖాన, మహిళా భవనం మానకొండూర్‌లో వచ్చిపోయేటప్పుడు ఆరెపల్లి మోహన్‌కు కనపడటం లేదా అన్నారు. అసత్యపు ఆరోపణలు మానుకొని, అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఉల్లంగుల ఏకాన ందం, ఆరెపల్ల నగేశ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీ నివాస్‌గుప్తలు పాల్గొన్నారు.