కరీంనగర్

వరద నష్టం వివరాలను... సేకరించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 13: జిల్లాలో గత సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు వరదవల్ల రోడ్లు, పంటలు, చె రువులు, కాలువలకు కలిగిన నష్టం వివరాలను సంబంధిత శాఖల అధికారులను కేంద్ర బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయుటకు కేంద్ర బృందం ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ముం దుగా జిల్లాలో వరదలవల్ల జరిగే నష్టానికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను బృ ందం సభ్యులు పరిశీలించారు. ఎస్సారెస్పీ కాలువ గండి, మద్య మానేర్ గండి, పంట నష్టం ఆర్‌అండ్‌బి, పం చాయతీరాజ్ రోడ్లు, నగరంలోని రోడ్లు దెబ్బతిన్న ఫోటోలను నిశితంగా పరిశీలించారు. అనంతరం శాఖలవారీగా ప్రాజెక్టు, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, పి ఆర్, నగరపాలక సంస్థ మేయర్ తమ తమ శాఖల పరిధిలో జరిగిన నష్టం వి వరాలను తెలిపారు. అనంతరం కేంద్ర బృందం నగరంలోని గణేష్‌నగర్ పెద్ద డ్రైనేజీని పరిశీలించారు.కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ కమిషనర్ జ గదీష్‌కుమార్, గోదావరి సర్కిల్ వాటర్ రిసోర్సెస్ ఎస్‌ఇ ఒఆర్‌కె.రెడ్డి, ఆర్ అండ్‌బి ఇఎన్‌సి పి.రవీందర్‌రావు, ప్రా జెక్టుల సిఇ అనీల్‌కుమార్, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, నగర మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, డిఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.