కరీంనగర్

బాబ్బాబు.. డబ్బులు తీసుకోరూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, నవంబర్ 17: ఒకప్పుడు అప్పు కావాలంటే వ్యాపారుల వద్దకు చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి సామాన్యుడిది.. నూటికి రూ.5 వడ్డీ చెల్లించడంతో పాటు ఆస్థి పత్రాలు తనఖా పెట్టాల్సిన దుస్థితి.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.500, రూ. వేయి నోట్లను రద్దు చేయడంతో వారం రోజులుగా బడా, వడ్డీ వ్యాపారుల వద్ద ఉన్న డబ్బులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిబంధనలు విధించడంతో లక్షలాది రూపాయాలు ఖాతాలో జమ చేసుకోవడానికి జంకుతున్నారు. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆలోచనలో పడ్డారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని గొల్లపల్లి, పదిర, వెంకటాపూర్, వీర్నపల్లి గ్రామాలకు చెందిన పెద్ద, వడ్డీ వ్యాపారులు గుట్టుగా డబ్బులు అప్పు కింద మరీ పిలిచి అప్పగిస్తున్నారు. రూ. లక్ష ఇస్తే.. తమకు మూడు నెలల తర్వాత రూ.80 వేలే చెల్లించాలని పేర్కొంటూ పత్రాలు రాయించుకుంటున్నారు. బాబ్బాబు డబ్బులు తీసుకోరు అంటూ ముట్టజెప్పుతున్నారు. ఇటీవల గొల్లపల్లి, వెంకటాపూర్, వీర్నపల్లి గ్రామాల్లో ఐదుగురు వ్యాపారులు సుమారు రూ.కోటి నగదు నమ్మకస్తులను పిలిచి ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున అప్పు కింద ఇచ్చారు. సదరు వ్యాపారుల ఇళ్ల వద్ద ప్రజలు పోగవడంతో విషయం బయటకు పొక్కింది.