కరీంనగర్

అర్థం కాని తరగతులు చెబుతున్నారా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 17: ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని వసతి గృహాల సబ్బందిని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ ఆదేశించారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుక బడిన తరగతుల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాలలోని విద్యార్థులతో ఆయన ముచ్చటిస్తూ వసతి గృహాలలోని ఇబ్బందులు, వార్డెన్, ఇతర సిబ్బంది హాజరు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, పాలు, గ్రుడ్లు, ఏయే సమయాల్లో అందిస్తున్నారు, విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాలు ఏయే తరగతల్లో ఏయే సబ్జెక్టుల్లో సమస్యలు, అర్ధంకాని తరగతులు, మళ్ళీ చెబుతున్నారా అని అడిగారు. గణితం, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో కొంత మేర అర్థం కావడం లేదని విద్యార్థులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భం గా వసతి గృహాల భవనాలు, మురుగుదొడ్లు, వంట గదులను ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో భవనం పూర్తిగా నీటితో కురుస్తుందని మరమ్మత్తులు చేయాల్సి ఉందని వార్డెన్‌లు తెలిపారు. వసతి గృహాల భవనం మరమ్మత్తులకు ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను క్షుణ్ణంగా విని, వాటిని మరల చదువుకుని మంచి విద్యను నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు. వసతి గృహాలలోని సిబ్బంది సమయపాలన పాటించాలని, విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని అన్నారు. కలెక్టర్ ఆకస్మికంగా వసతి గృహాలను సందర్శించారు. వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం ముందు ఉన్న మురికి కాలువలను వెంటనే శుభ్రపర్చాలని, నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు.