కరీంనగర్

వరద కాలువలో పడి తల్లీ కొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, డిసెంబర్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ, మతిస్థిమితం లేని కొడుకుతో వేగలేక జీవితంపై విరక్తి చెంది తల్లీ, కొడుకులు వరద కాలువ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కారుపాకల శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెగడపల్లి గ్రామానికి చెందిన ఉడుత సులోచన(45), కొడుకు మనోజ్ (15) వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్దిరోజులనుండి సులోచన మెడపై కంతితో బాధపడుతోందని, దీనికితోడు తన కుమారుడైన మ నోజ్ మతిస్థిమితం లేనివాడని మనోవేదన చెందుతుండేది. ఆదివారం సాయం త్రం వరద కాలువలో పడి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వరద కాలువలో పడి ఉన్న శవాలను చూసిన స్థానిక వ్యవసాయదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను బ యటకు తీసి మృతుల బంధువులకు సమాచారం చేరవేశారు. మృతురాలి భర్త ఉడుత లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ధర్మారం, డిసెంబర్ 5: మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని వేముర్ల విశాల(18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మా రం ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. తన సొంత ఇంటిలోని స్టోర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, తల్లిదండ్రులు పుష్పలత-శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమతి లేని వాహనాల సీజ్
ధర్మారం, డిసెంబర్ 5: ధర్మారం మండలంలోని బంజేరుపల్లి గ్రామంలో పెద్దపల్లి సిఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించారు. ఈ నాకాబందీలో గ్రామంలోని అన్ని కుటుంబాల వివరాలను సమగ్రంగా పరిశీలించి వాహనాల లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్ పేపర్లు, రిజిస్ట్రేష న్ కాగితాలు సరిగా లేనివాటిని సీజ్ చేశారు. ఈ నాకాబందీలో ధర్మారం, బసంత్‌నగర్, పెద్దపల్లి ఎస్‌ఐలతోపాటు డిస్టిక్‌గార్డులు పాల్గొన్నారు.