కరీంనగర్

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, డిసెంబర్ 5: హుజూరాబాద్ పట్టణ శివారులోని కెసి క్యా ంపులో పెళ్లి పోరుతో ఓవ్యక్తి తనను మోసం చేసాడంటూ యువతి సోమవారం ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన తోటి వైశాలి (23) హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు కెసి క్యా ంపుకు చెందిన కలకోటి క్రాంతికుమార్ పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి వీరు జూన్ 2న హైదరాబాద్ సమీపంలోని జగద్గిరిగుట్ట శివాలయంలో వివాహం చేసుకున్నారు. వీరు కూకట్‌పల్లిలో కొద్దిరోజులు కాపురం కూ డా చేశారు. నెలరోజులక్రితం క్రాంతికుమార్ తల్లిదండ్రులు కూకట్‌పల్లికి వచ్చి గొడవ చేసారు. క్రాంతికుమార్ అప్పటినుండి కెసిక్యాంప్‌లోనే ఉంటున్నాడు. తానవద్ద క్రాంతికుమార్ ఇప్పటివరకు రూ.2 లక్షల నగదుతోపాటు తులం బ ంగారం కూడా తీసుకున్నాడని, క్రాంతి తల్లిదండ్రులు తమ కుమారుని వేరే వి వాహం చేస్తామంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని దీక్ష చేసి అనంతం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

ఎన్‌టిఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
జమ్మికుంట, డిసెంబర్ 5: స్కాలర్‌షిప్‌ల విడుదలలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ ఎన్‌టిఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జమ్మికుంట లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎన్‌టిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అమ్మ వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయంబర్స్ మెంటుతో పాటు బకాయి పడ్డ స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రశాంత్, నరేష్, అజయ్, రాకేష్, శివ, అఖిల్, మహేష్, రాణి, అర్చన, స్వాతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.