కరీంనగర్

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 5: మిషన్ భగీరథ పథకంకింద చేపట్టే పనుల నాణ్యతలో రాజీపడవద్దని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారుల ను ఆదేశించారు. ఈ పథకంకింద జి ల్లాలో వేస్తున్న తాగునీటి పైపులైన్లు భూమికి 1.5 మీటర్ల లోతు నుండి వే యాలని సూచించారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ స ర్ఫరాజ్ అహ్మద్ ఎమ్మెల్యేలతో కలిసి స ంబంధిత అధికారులతో మిషన్ భగీర థ పనులపై మంత్రి సమీక్షించారు. ప్ర భుత్వం వేల కోట్ల ఖర్చుతో తాగునీటి పైపులైన్లు వేయిస్తుందని, అవి 50 నుం చి 60 సంవత్సరాల వరకు మన్నికగా ఉండేందుకు, వాటిపైనుండి ఎన్ని ట న్నుల బరువుతో వాహనాలు వెళ్లినా ప గిలిపోకుండా ఉండేందుకు లోతునుం డి పైపులు వేయాలని సూచించారు. రోడ్‌క్రాసింగ్‌లవద్ద పైపులైన్లు వేసేముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. గ్రామాలలోగల వాటర్ ట్యాంక్‌లను పరిశీలించి పాతవి, లీకేజీలు ఉ న్న ట్యాంక్‌ల స్థానంలో కొత్త ట్యాం క్‌లు నిర్మించాలన్నారు. వాటర్ పైపుల తయారీ కేంద్రాలలో పైపుల మందం నాణ్యత ప్రమాణాలపై ప్రతీరోజు మి షన్ భగీరథ ఇంజనీర్లు తనిఖీలు చే యాలని, పర్యవేక్షించాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, మిషన్ భగీర థ ఇంజనీర్లు జిల్లాలో అభివృద్ధి ప నులు ప్రారంభించేముందు సమన్వయంతో చర్చించుకొని భవిష్యత్‌లో ప్రస్తుతం వేసిన రోడ్లు, పైపులైన్లు తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలో కొత్త రోడ్లు వేసేము ందు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను స ంప్రదించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కొత్త రోడ్లు వేస్తున్నప్పుడు రై తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వంద మీటర్లకు ఒకటి చొప్పున రోడ్డు కింద పెద్ద పైపులను వేయాలని, దాని ద్వారా రైతులు సాగునీటి పైపులు వేసుకుంటారని తెలిపారు. రైతులు రో డ్లను కట్ చేయరాదన్నారు. మిషన్ భ గీరథ పనులను చాలా పర్పెక్ట్‌గా చే యాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నగర మేయర్ రవీందర్ సింగ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభ్యున్నతే తెలంగాణ సర్కారు ధ్యేయం
* ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
* మండల సమాఖ్య భవనం ప్రారంభం
గోదావరిఖని, డిసెంబర్ 5: మహిళల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం రామగుండం మండల కేంద్రంలో రూ. 32 లక్షల నిధులతో నిర్మాణం చేసిన మండల సమాక్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని స్వశక్తి మహిళా గ్రూప్ సంఘ సభ్యులనుద్ధేశించి మా ట్లాడారు. స్వశక్తి సంఘాలు సంపూర్ణంగా, ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్‌ల ద్వారా వారికి రుణాలను మంజూరు చేస్తుందని, మహిళలను అన్ని రంగాల్లో ఎదుగుదల సాధించడం కోసం చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చే సుకొని వీరంతా ఒక సంఘటిత శక్తిగా ఎదగాలని సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు రామగుండం మండల పరిధిలో స్వశక్తి మహిళా గ్రూప్‌లకు రూ. 7 కోట్ల నిధులను బ్యాంక్‌ల ద్వారా అందజేయడం జరిగిందని, మరింతగా వీళ్లు అభివృద్ధి సాధించేందుకు మరికొన్ని కోట్లాది రూపాయల నిధులను అందజేసేందుకు బ్యాంక్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎం పిపి ఆడేపు రాజేశం, జడ్పిటిసి సంధ్యారాణి, ఎంపిడిఓ ఆకుల సంజీవరావు, ఐకెపి నిర్వాహకురాలు నర్సమ్మ, అధికారి అంజయ్య, వైస్ ఎంపిపి కుదురుపాక పవన్, సర్పంచ్ మస్కం శ్రీనివాస్, ఎంపిటిసి తిగుట్ల రాజయ్య, నాయకులు దేవి లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.