కరీంనగర్

సమస్యలపై చర్చలేనా.. పరిష్కారాలు చూపేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 10: సీమాంధ్రుల పాలనతో మసకబారిన తెలంగా ణ బతుకులు మార్చుకునేందుకు స్వ యంపాలన వైపు అడుగులేసిన తెలంగాణీయులకు, మరింత తేజోవంతంగా అభివృద్ధి ఫలాలు అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వీభజన కు శ్రీకారం చుట్టి, విజయవంతంగా పూర్తిచేసింది. జిల్లాల విభజన జరిగి నేటికి సరిగ్గా రెండు మాసాలు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకం కాగా, స్థానిక సంస్థల పెద్దన్నగా చెప్పుకునే జిల్లా ప రిషత్ సర్వసభ్య సమావేశం జిల్లాల ఆ విర్భావానంతరం తొలిసారిగా ఆదివార ం జరగబోతుండగా, ఏడు జిల్లాల అధికారగణంతోపాటు నాలుగు జిల్లాలకు చెందిన మండల, జిల్లా, అసెంబ్లీ, మం డలి, పార్లమెంటు నియోజకవర్గ స్థా యి ప్రజాప్రతినిధులు హాజరుకాబోతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల ఇబ్బందులు, వా రి సంక్షేమం, వారికందాల్సిన ప్రభుత్వ పథకాలపై పూర్తిస్థాయిలో చర్చించి, వాటి అమలుకోసం అధికార యంత్రా ంగాన్ని పురమాయించటం సమావేశం ముఖ్య ఉద్ధేశం. కానీ ప్రతి మూడు మాసాలకోమారు జరిగే ఈ సమావేశా ల్లో సభ్యులు తమతమ ప్రాంతాల్లోని సమస్యలను ఉటంకించటం.. వాటిని పరిష్కరించేందుకు తాము చర్యలు తీ సుకుంటామంటూ అధికారులు తలూపటం, ఆతర్వాత మర్చిపోవటం షరామామూలుగానే మారింది. అధికారుల అలసత్వం, కొంతమంది ప్రజాప్రతి ‘నిధుల’ నిర్లక్ష్యం దానిని నీరుగార్చుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా విద్య, వైద్యరంగాలతోపా టు వ్యవసాయ రంగంలో కూడా ఉ మ్మడి కరీంనగర్ జిల్లావాసులకు ప్రభు త్వ సాయం అరకొరగానే అందిందనే విమర్శలున్నాయి. ఉపాధి కూలీలకు సైతం వేతనాలివ్వటంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే వాదనలున్నాయి. వీటిపై గత సమావేశాల్లో పలుమార్లు సభ్యులు ప్రస్తావించినా పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన ఫ్రెండ్లీ ఎంప్లాయింగ్‌ను అలుసుగా చేసుకుని, అత్యధికశాతంమంది ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే విమర్శలు కోకొల్లలు. వీటన్నిటికి పుల్‌స్టాప్ పెట్టి కొత్త జిల్లాల్లోనైనా నాలుగు జిల్లా ల ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నద్దం కావాల్సిన అవసరముందనేది విమర్శకుల అభిప్రాయం. కాగా, ప్రతిసారి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే జడ్పీ సర్వస భ్య సమావేశాన్ని కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. మొత్తానికి జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా జరగనున్న జడ్పీ సమావేశానికి నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, ఏడు జిల్లాల అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకోగా, మరీ ఈసారైనా ప్ర జాసమస్యల పరిషార్కానికి మార్గాలు చూపుతారో లేదో వేచిచూద్దాం.

జోష్‌గా... ఫ్లాష్ మాబ్
ఆకట్టుకున్న ‘షీ టీం’ ప్రదర్శన

గోదావరిఖని, డిసెంబర్ 10: విద్యార్థినులు, మహిళలపై జరుగుతున్న దా డులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘షీ టీం’లపై నిర్వహించిన అవగాహన ప్రదర్శనలు జోరుగా... హుషారుగా సాగాయి. రా మగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రధా న చౌరస్తాలో క్రిష్ణవేణి టాలెంట్ స్కూ ల్ విద్యార్థులు చేపట్టిన ‘్ఫ్లష్ మాబ్’ జోషెత్తించాయి. విద్యార్థినీలపై ఈవ్ టీ జర్స్ వేధింపులు... దాడులు... దీనికి షీ టీంల నుంచి తీసుకొని సహకారాలపై క్రిష్ణవేణి స్కూల్ విద్యార్థులు సుమారు 3 గంటలపాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి. ప్రదర్శన లు తిలకించేందుకు వచ్చిన ప్రజల్లో కూడా షీ టీం ప్రాధాన్యతలను ఆలోచి ంపజేశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దు గ్గల్ విద్యార్థులనుద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం విద్యార్థులు, మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను సమూలంగా అరికట్టేందుకే షీ టీంల ఏర్పాటు జరిగిందని, ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరుగుతుం దో... అక్కడ షీ టీంలు ప్రత్యక్షమవుతాయని చెప్తూ షీ టీంల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డిసిపి విజేందర్‌రెడ్డి, సిఐలు ఆరె వెంకటేశ్వర్, చిలుకూరి వెంకటేశ్వర్లు, క్రిష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌బాబు, మహే ందర్, శ్రీనివాసరావుతోపాటు వివిధ క ళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు పాల్గొన్నారు. షీ టీంలో మేము సైతం... భాగస్వామ్యులమవుతామని విద్యార్ధినులు ప్రతిజ్ఞ చేశారు. ఊరూరు, వాడవాడ, ప్రతీ పాఠశాల, క ళాశాలల్లో షీటీంల ఏర్పాటుకు మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని విద్యార్థినులు ఉద్వేగంగా చెప్పారు.