కరీంనగర్

వైభవంగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 25: యేసుక్రిస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైస్తవులు ఆదివారం క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో అన్ని చర్చిల ను ప్రత్యేకంగా అలకరించారు. విద్యుత్ కాం తులతో చర్చీలన్ని దగదగలాడాయి. శనివారం రాత్రి నుంచే క్రిస్మస్ సందడి నెలకొనగా, ఆదివారం ఉదయం ఆరాధనతో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో యేసు కీర్తనలు మారుమ్రోగాయి. ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రైస్తవ సోదరులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిలతోపాటు క్రైస్తవుల ఇళ్లల్లోనూ రంగురంగుల స్టార్లు కన్పించాయి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు క్రైస్తవ సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదరులనుద్దేశించి ప్రసంగించారు. అలాగే జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి క్రిస్మస్ వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుగగా, క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతో యేసును కీర్తించడంతో యేసు కీర్తనలు మారుమ్రోగాయి.
అలరించిన శాస్ర్తియ సంగీత విభావరి
ధర్మపురి, డిసెంబర్ 25: విశ్వవిఖ్యాత గాన గంధర్వ దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణకు అశృనివాళి అర్పిస్తూ, సంగీత సరస్వతి సంస్మరణార్థం ధర్మపురి క్షేత్రస్థ బ్రాహ్మణ సంఘ భవనంలో ఆదివారం రాత్రి స్థానిక కళాకారులచే సంగీత రత్న కొరిడె నరహరి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్ర్తియ సంగీత విభావరి ఆబాల గోపాలాన్నీ అలరించింది. రేవతి, సావిత్రి, గుండి శంకరశర్మ, సంగనభట్ల రామకిష్టయ్య, పాలెపుచంద్రవౌళి శర్మ, కవోజ్జల నీలకంఠ శర్మ, కొరిడె శంకర్, రమేశ్‌ల నోళ్ళ అలవోకగా జాలువారిన బాల మురళీ పాడిన కీర్తనలు సంగీతజ్ఞులను సంగీత సాగరంలో ముంచెత్తాయి. కళాకారులను బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు లింగన్న, అధ్యక్షులు ఇందారపు రామయ్య, ప్రధాన కార్యదర్శి నందగిరి గిరిధర్‌లు సన్మానించారు.