కరీంనగర్

విద్య ప్రైవేటీకరణను అదుపుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 3: విద్యా ప్రైవేటీకరణను అదుపు చేయాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రఘుశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ విద్యా సంరక్షణ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ ఆ ధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే 186 జయంతి సందర్భంగా విద్యా రంగ సమస్యలపై స్థానిక ఫిలీం భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా చైర్మన్ ప్రోఫేసర్ సూరపల్లి సుజాత అధ్యక్ష వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.రఘశంకర్‌రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో, రాష్ట్రంలో విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను అరికట్టాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రిలియన్స్ సంస్థలకు వేయి ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం అందులో కేజీ టు పీజీ వరకు రిజర్వేషన్‌లకు అవకాశం లేకుండా అ డ్మిషన్లు చేసుకోవడానికి చట్టాలను సవరించాలని అనడం రాజ్యాంగాన్ని ఉ ల్లంఘించడమే అన్నారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ తదితర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని కో రారు. కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అ ధ్యక్షుడు పి.ఈశ్వర్‌రెడ్డి, తెలంగాణ పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు పి.వేణుగోపాల్‌రావు, బిటిఎ జిల్లా అధ్యక్షుడు కొడుముంజ శంకర్, డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చంద్రవౌళి, నారాయణరెడ్డి, వెంకట్రావ్, ప్రసాద్, గుర్రాల రవీందర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

కరెంట్ షాక్‌తో
అసిస్టెంట్ లైన్‌మెన్ దుర్మరణం
* హుజూరాబాద్‌లో విషాదం
హుజూరాబాద్, జనవరి 3: హుజూరాబాద్ పట్టణంలోని డిపోక్రాస్ వద్ద విద్యుత్తు సంబంధ మరమ్మత్తులకో సం స్తంభంపైకి ఎక్కిన అసిస్టెంట్ లైన్‌మెన్ రావుల బ్రహ్మచారి విద్యుత్తు షాక్ తగిలి కిందపడి అక్కడికక్కడే మ రణించిన స్థానికంగా విషాదం నిం పి ంది. లైన్‌పైఉన్న లోపాన్ని సవరించేందుకు మరో ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులతో కలిసి బ్ర హ్మచారి సరఫరా నిలిపివేసి వచ్చి పో ల్ పైకి ఎక్కి పనిచేస్తుండగా అనుకోనిరీతిలో విద్యుదాఘా తం రావడంతో ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బ్రహ్మచారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రజని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే బ్రహ్మచారి పనిచేస్తుండగా అదే లైన్‌కు అనుకుని పైనుండి వెళ్తున్న మరో లైన్ తెగిపడి విద్యుత్తు షాక్ తగిలినట్లు విద్యుత్తు సిబ్బంది గుర్తించా రు. విద్యుత్తు ఉద్యోగులతోపాటు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి, ప్రభుత్వాసుపత్రి వద్దకు మృతదేహాన్ని చూసేందుకు వచ్చారు. బ్రహ్మచారికి విధి నిర్వహణలో మంచి పేరుందని, అంకిత భావంతో విధులు నిర్వహించేవాడని, అతడు మరణించిన లోటు పూడ్చలేదనిదని విద్యుత్తు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తెలిపారు.