కరీంనగర్

గుట్కా, మట్కా, జూదంపై... ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 3: గుట్కా, మ ట్కా, జూదంలపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ ఇన్‌చార్జి డిఐజి సి.రవివర్మ పోలీసు అధికారులను ఆదేశించా రు. వీటివల్ల అనేకమంది బీద, మధ్య తరగతి ప్రజలు నష్టపోతున్నారన్నారు. కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో మ ంగళవారం కరీంనగర్ కమీషనరేట్, జ యశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసి ల్ల, జగిత్యాల జిల్లాలకు సంబంధించి ప్రత్యేక నేర సమీక్షా సమావేశం జరిగిం ది. ఈసందర్భంగా డిఐజి మాట్లాడు తూ మట్కా జూదం నిర్వాహకుల కదలికలపై నిఘా ఉంచాలని, నిషేదిత పొ గాకు ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరి పేవారిపై కేసులను నమోదు చేయాలని సూచించారు. విచారణలో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతంగా కొనసాగించాలన్నారు. తీవ్రమైనటువంటి కేసు ల్లో నిందితులకు శిక్షలు పడేలా పకడ్బ ందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. వ్యక్తిగత మోసాలకు సంబంధించి న కేసుల్లో సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాన్ బెయలబుల్ వారెంట్ల ఉన్న వ్యక్తులు ఇతర దేశాల్లో ఉన్నట్లయితే లుక్ అవుట్ నోటిసులను జారీచేయాలని ఆదేశించారు. నాన్ బే లబుల్ వారెంట్ల అమలుకు ప్రత్యేక వి భాగాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. సాధారణ రోడ్డు ప్రమాదాల్లో కూడా నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలం నుండి నిలిచిఉన్న నాన్ బేలబుల్ వారెంట్లను అమలుచేసిన కరీంనగర్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ తుల శ్రీనివాస రావు, కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి, కేశవపట్నం హెడ్‌కానిస్టేబుల్ జయశంకర్‌లను డిఐజి ప్రత్యేక రివార్డులను అందజేసి అభినందించారు. సమావేశంలో కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి .కమలాసన్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి, జగిత్యాల ఎ స్పీ అనంతశర్మ, కరీంనగర్ అడిషనల్ సిపి అన్నపూర్ణ, ఎసిపిలు, డిఎస్పీలు రామారావు, రవీందర్‌రెడ్డి, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

‘మహిళల హక్కులే... మానవ హక్కులు’
* ఉపాధ్యాయుల సన్మానోత్సవంలో జెసి యాస్మిన్‌బాషా
సిరిసిల్ల, జనవరి 3: సమాజ మా ర్పుకై మహిళలకు భర్త, కుటుంబం ప్రోత్సాహం ఉంటే ఎక్కడైనా మహిళ లు అత్యున్నత స్థాయికి ఎదుగుతార ని, మహిళల హక్కులే మానవ హక్కులని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బా షా అన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉ పాధ్యాయ సంఘం సిరిసిల్ల జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను జెసి యాస్మిన్‌బాషా, డిఇవో డి.రాధాకిషన్ చేతుల మీదుగా సన్మానించారు. జెసి మాట్లాడుతూ మ హిళలకు రిజర్వేషన్లవల్ల ఎన్ని పదవు లు వచ్చినా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సరైన ప్రో త్సాహం, సరైన సహకారం అందిస్తే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అలాగే సావిత్రిబాయి, జ్యోతిబాపూలే జీవిత త్యాగాలవల్ల వచ్చిన విద్యావకాశాలను అందరు అందిపుచ్చుకోవాలని కోరారు. గురువులుగా మన బాధ్యత ను సరిగ్గా నిర్వహిస్తూ, పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమై న బాధ్యత గురువులదేనన్నారు. డిఇ వో డా. రాధాకిషన్ మాట్లాడుతూ రాబోయే తరాలలో మహిళలదే అగ్ర భాగం అవుతుందన్నారు. ప్రస్తుత అన్ని ఉద్యోగ రంగాలలో పురుషులకు దీటుగా పోటీ పడుతున్నారని సావిత్రిబాయిపూలె స్ఫూర్తితో ఇంకా ముం దుకువెళ్ళాలని ఆకాంక్షించారు. సంఘ ం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీల అక్షరాస్యత 60 శాతం మించలేదని, స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ రంగాలకు ఇంకా విద్య పూ ర్తిస్థాయిలో అందలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సిరిసిల్ల, గంభీరావుపేట, కోనరావుపేట జడ్పిటిసిలు మంజుల, పద్మ, అన్నపూర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఎన్.సరస్వతి, శైలజ, పద్మ, రాజేశ్వరి, పావని, సిఐ మాధవి పాల్గొన్నారు.