కరీంనగర్

తరలిస్తారా... చావమంటారా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 20: సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌తో మా కాలనీకి ముంపు ఉందన్న పట్టించుకోరే... మా బతుకులంటే అంత నిర్లక్ష్యమా... సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా... లేక చావమంటారా... ఏదో ఒక్కటి తేల్చి చె ప్పాలంటూ... అంతర్గాం మండలం లింగపూర్ దళిత కాలనీ కుటుంబాలు సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ముందు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగుతోంది. దళిత కాలనీకి చెందిన వందలాది కుటుంబాలు ఓపెన్‌కాస్టు ప్రధాన ద్వారం ముందు బైఠాయి ంచి ఆందోళనకు దిగారు. ఓపెన్‌కాస్టులోకి ఒక్క కార్మికుడు కూడా వెళ్లకుండా న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు. దీంతో మేడిపల్లి ఓపెన్‌కాస్టులో ఉత్పత్తి నిలిచిపోయింది. మొదటి షిఫ్ట్, రెండవ షిఫ్ట్‌లో ఎలాంటి పని జరుగలేదు. లింగపూర్ దళిత కాలనీ వాసులు సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలన్న డిమాండ్‌తో కొనసాగుతున్న ఆందోళనకు రాజకీయ పార్టీల మద్ధతు లభించింది. తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతున్న జాప్యంపై కాలనీవాసులు మండి పడ్డారు. సర్వేలు జరిపి పరిహారం చెల్లించకుండా సురక్షిత ప్రాంతానికి తరలించకుండా సింగరేణి యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యంపై ఆందోళనకారులు తీవ్రంగా గర్జించారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్‌తో ప్రాణహానీ ఉందని, మా కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించాలని దళిత కుటుంబాలు మునుపెన్నడూ లేని విధంగా చేపట్టిన గగ్గోలుతో మేడిపల్లి ఓపెన్‌కాస్టులో ఒక రోజంతా బొగ్గు ఉత్పత్తులకు ఆటంకం కలుగడం సింగరేణి చరిత్రలో సంచలనంగా నిలిచిపోయింది. ఆందోళన స్థలికి సింగరేణి ఉన్నతాధికారులు ఆంటోని రాజా, మురళీ సాగర్‌తోపాటు రామగుండం సిజిఎం వెంకటేశ్వర్‌రావు చేరుకొని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేసినా దళిత కుటుంబాలు ససేమీరా అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా లింగపూర్ దళిత కుటుంబాలు ఓపెన్ కాస్టు ముందు పెద్ద ఎత్తున లొల్లికి దిగడం, దీని పర్యావసనంగా ఓసిపిలో ఉత్పత్తులు నిలిచిపోవడం సింగరేణి ఉన్నతాధికారులను తలలు పట్టుకునేలా చేసింది. దళిత కుటుంబాల నిరంతర ఆందోళనలతో మేడిపల్లి ఓపెన్ కాస్టు ఉపరితల బొగ్గు గని ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను ధర్నా విరమించాలని కోరినా కాలనీవాసులు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితే లేదని తెగేసి బదులిచ్చారు. సింగరేణి ఉన్నతాధికారులతో కాలనీవాసు లు వాగ్వివాదానికి దిగారు. నెల రోజులు గడువు కావాలని అధికారులు పేర్కొన గా ఆందోళనకారులు ఒప్పుకునే సమస్యే లేదని భీష్మించుకు కూర్చొన్నారు. ఉ త్పత్తి నిలిచిపోయిందని, సహకరించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన సింగరేణి అధికారులకు ఆందోళనకారుల నుంచి వ్యతిరేక పవనాలే వినిపించాయి. కొత్త గూడెంలో చర్చిద్ధామని, అప్పటివరకు ఆందోళన విరమించాలని పేర్కొన్న మే ము అక్కడికి వచ్చే పరిస్థితే లేదని, ఇకపై గడువు ఇచ్చేదే లేదని ఏదైనా ఉంటే ఇప్పుడే... ఇక్కడే... అగ్రిమెంట్ జరగాలని కరాకండిగా తేల్చిచెప్పారు.