కరీంనగర్

ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక, జనవరి 20: మండలంలోని ఘన్ముక్ల గ్రామం వద్దగల మోడల్ స్కూళ్లో శుక్రవారం కరీంనగర్ డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్ బావుసింగ్, ఎంపిడిఓ భాస్కర్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ధర్నా
సుల్తానాబాద్, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర పథకాలలో పనిచేసే టీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ రజితకు వినతిపత్రం సమర్పించారు. ఇందులో సిఐటియు కమిటీ సభ్యుడు సీపెల్లి దిలీప్, ఆశావర్కర్ల జిల్లా అధ్యక్షురాలు జి.సంధ్యారాణి, ఎన్. సుజాత, స్వరూప, రమ, సరోజన, అంగన్‌వాడీ వర్కర్స్ అనసూయ, జయలక్ష్మి, గంగమ్మ, రాణితోపాటు పలువురు పాల్గొన్నారు. సంధ్యారాణి మాట్లాడుతూ స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడంతోపాటు కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని, రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని, స్కీం వర్కర్లతో ప్ర భుత్వం చేయిస్తున్న అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని, అదనపు నిధు లు కేటాయించాలని, బకాయిపడ్డ వేతనాలు చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఇతర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు.
రేపు సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశం
సుల్తానాబాద్, జనవరి 20: సుల్తానాబాద్ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య స మావేశం ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ వినోద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిపి పారుపెల్లి రాజేశ్వరి అధ్యక్షతన జరుగు సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని రైతు మృతి
వీణవంక, జనవరి 20: వీణవంక (మం) ఎలుబాక గ్రామ శివారు వద్ద శుక్రవారం ఉదయం అతివేగంతో వస్తున్న ఇసుక ట్రాక్టర్ మాడ పున్నారెడ్డి (44) అనే రైతును ఢీకొట్టగా పున్నారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూర్ (మం) ఊటూరు గ్రామ శివారు మానేరు వాగు నుండి జిల్లెడ అనీల్‌యాదవ్ అనేవ్యక్తి తన సొంత ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడు. ఎలుబాక గ్రామ శివారువద్ద రహదారిపై నుండి మృతుడు పున్నారెడ్డి సైకిల్‌పై వస్తుండగా అతివేగంతో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టగా మృతిచెందాడు. డ్రైవర్ అనీల్‌యాదవ్ ఘటనా స్థలంనుండి ట్రాక్టర్‌ను నిలిపి ఫరారవుతుండగా గ్రామస్థులు గమనించి పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ దామోదర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి కుమారుడు అశ్విత్‌రెడ్డి, కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు.
ప్రేంచందర్‌ను పరామర్శించిన శంకర్‌రెడ్డి
సుల్తానాబాద్, జనవరి 20: సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ మాజీ ఎం పిటిసి, టిఆర్‌ఎస్ నాయకుడు పురం ప్రేంచందర్‌రావు తల్లి విమలాదేవి ఇటీవల మృతిచెందగా, శుక్రవారం రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంటు చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ప్రేంచందర్‌రావు, దిలీప్‌రావులను పరామర్శించారు. విమలాదేవి చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శంకర్‌రెడ్డి వెంట టిఆర్‌ఎస్ నాయకులు, జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కా ర్యదర్శి డాక్టర్ అయిల రమేష్, పార్టీ మండల కన్వీనర్ బుర్ర శ్రీనివాస్, బుర్ర కుమా ర్, మాజీ సర్పంచ్ మాటేటి గట్టయ్య, నాయకులు సుఖేందర్‌రెడ్డి, ఎండి.సర్వర్, పోచమల్లు, పలువురు ఉన్నారు.
బ్యాడ్మింటన్‌లో రాష్టస్థ్రాయికి ఎంపికైన సాయితేజ
సుల్తానాబాద్, జనవరి 20: పెద్దపల్లి జిల్లాస్థాయి ఖేలో ఇండియా షటిల్ బ్యా డ్మింటన్ ఆటల పోటీల్లో స్థానిక ఆల్పోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎ.సాయితేజ అద్భుతమైన ప్రతిభను కనబర్చి రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 బాలుర విభాగంలో 9వ తరగతి చదువుతున్న సాయితేజ రాష్టస్థ్రాయికి ఎంపికకావడంపట్ల విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఎ ంపికకు కృషిచేసిన పిఇటి సత్యంను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమ ంలో పాఠశాల ప్రిన్సిపాల్ డిఎస్.కుమార్, పలువురు ఉన్నారు.