కరీంనగర్

బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకై శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యైటింక్లయిన్ కాలనీ, జనవరి 31: సింగరేణి ఆర్జీ-2కు నిర్ధేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకై కార్మికులు, అధికారులు సమష్టిగా మరింత శ్రమించాలని ఆర్జీ-2 జిఎం విజయపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్జీ-2 జిఎం కార్యాలయంలో ఆయన మాస బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. జనవరి మాసం ఆర్జీ-2లో 6,08,000కు గాను 6,65,617 టన్నులతో 109 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన్నట్లు తెలిపారు. ఇందులో భూగర్భ గనుల వారిగా వికెపి నుంచి 29,294 టన్నులతో 106శాతం, 7ఎల్‌ఇపి నుంచి 19,915 టన్నులతో 103శాతం, అదేవిధంగా ఓసిపి-3 నుంచి 4,97,374 టన్నులతో 121 శాతం, ఓసిపి-3 ఫేజ్-2 1,19,034 టన్నులతో 76శాతం బొగ్గు ఉత్పత్తి చేసిన్నట్లు వెల్లడించారు. ఆర్జీ-2 వార్షిక లక్ష్య సాధనకై రోజుకు 26వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని తెలిపారు. మొదటి సారిగా రెండు భూగర్భ గనుల నుంచి వంద శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ మాసంలో సింగరేణి మొత్తంలో ఆఫ్ లోడింగ్ అత్యధిక ఉత్పత్తి తీసి నెంబర్ వన్ స్థానాన్ని ఆర్జీ-2 కైవసం చేసుకుందని తెలిపారు. అదేవిధంగా సిహెచ్‌పి నుంచి అత్యధికంగా బొగ్గు సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. యైటింక్లయిన్‌కాలనీ పరిసరాల్లో రక్షణ విషయంలో త్వరలో రామగుండం కమీషనరేట్ ఆదేశాల మేరకు సిసి కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రభావిత గ్రామమైన మంగల్‌పల్లి, పెద్దంపేట వారికి ప్రత్యేకంగా వృత్తి శిక్షణ భాగంగా టైలరింగ్, మగ్గం వర్క్స్ నేర్పించడం జరుగుతుందని, ఆ గ్రామాల్లో త్వరలో మినీ మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, యైటింక్లయిన్ కాలనీకి మంచి నీటి సమస్యను త్వరలో తీర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ ఓ టూ జి ఎం రవీందర్, ఎజి ఎం రాజేష్, ఐ ఇడి చిరంజీవి, ఫైనాన్స్ ఆఫీసర్ రామక్రిష్ణ, అధికార ప్రతినిధి ఎన్.వెంకటేశ్వర్ రావు, డివైపి ఎం. రాజేంద్ర ప్రసాద్, కో- ఆర్డినేటర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్‌తోనే రైతులకు న్యాయం
* హుస్నాబాద్ ఎమ్యెల్యే సతీష్‌బాబు
హుస్నాబాద్, జనవరి 31 : టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ ఎమ్యెల్యే సతీస్‌బాబు అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కందుల కోనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను గిట్టుబాటు ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్,గజ్వేల్ ,సిద్దిపేటలో కందుల కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు ఐదువేల యాబై రూపాయల మద్దతు ధరను పొందవచ్చని తెలిపారు. తర్వాత పలు విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిపి , నగర పంచాయతీ చైర్మన్ మార్కెట్ కమిటి చైర్మెన్, మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.