కరీంనగర్

మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 20: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా స్ర్తి నిధి ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అంతేకాకుండా మహిళలందరూ సంఘటిత శక్తితో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సోమవారం కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా సీతారామచంద్ర సమాఖ్య ప్రతినిధులకు పలు రకాల రుణాలు పంపిణీ చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మం త్రి మాట్లాడుతూ మహిళలంతా సం ఘటితంగా మారితే ఏ పనైనా సులువుగా సాధించవచ్చన్నారు. జిల్లాకు ఉపాధి హామీ పనులకు రూ.250 కోట్లను మంజూరు చేస్తే, ఇప్పటివరకు కేవలం రూ.36 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ఒక్కరోజే రూ.40.36 లక్షలు పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే రూ.60 కోట్లు అందించామని తెలిపారు. మహిళలు ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా ఉపాధి పనులకు వెళ్లాలని, దీని ద్వారా రోజుకు 190 రూపాయలు వస్తాయన్నారు. కరీంనగర్ జిల్లాలో లక్షా 50 వేల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని వివరించారు. జిల్లాలో మహిళా సమాఖ్య కోసం పక్కా భవనానికి కోటి రూపాయల నిధులు, జడ్పీ ఉద్యోగుల క్వార్టర్స్ పునరుద్ధరణకు మరో కోటి రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం రూ.40.36 కోట్ల రు ణాలను మహిళా సంఘాలకు అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ రవీందర్ సింగ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, జడ్పీటిసిలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి నిధులు
మురిగిపోనివ్వద్దు
ఉపాధి హామీ నిధులు మురిగిపోకుండా పనులను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పనులకు కేటాయించిన నిధులను పూర్తిగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం పంచాయతీ రాజ్ పనులపై కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీర్లతో మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా గ్రామా ల్లో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం పనులను మార్చి 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్, మేయర్ రవీందర్ సింగ్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
జాతర విజయవంతానికి కృషి చేయాలి
జగిత్యాల జాయంట్ కలెక్టర్ , సబ్ కలెక్టర్
సారంగాపూర్, ఫిబ్రవరి 20: జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగిత్యాల జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, సబ్ కలెక్టర్ ముష్రాఫ్ అలీ పేర్కొన్నారు. సోమవారం సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బ రాజన్న ఆలయంలో ఈనెల 22నుండి 26 వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాల నిర్వహనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో వాలంటీర్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోనేరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, జాతర ప్రాంగణంలో బ్లీచింగ్ పౌడర్, మురుగు నీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా విఐపిల పాసులను రద్దు చేయాలన్నారు. భక్తులకు నీడ కోసం చలువ పందిళ్లు, మంచినీరును గుర్తించిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు లోనికి రాకుండా క్రమబద్దికరించాలని సూచించారు. కార్యక్రమంలో పెంబట్ల, కోనాపూర్ గ్రామాల సర్పంచ్‌లు రామలక్ష్మి, తోడేటి శేఖర్, ఎంపిటిసి లక్ష్మిరాజం, పౌండర్ ట్రస్టీ చైర్మన్ పొరండ్ల శంకరయ్య, తహశీల్దార్ వెంకటరమణ, ఎంపిడిఒ పుల్లయ్య, ఇఒ ధనుంజయ్ తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.