కరీంనగర్

రాష్ట్రంలో గడీల పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో గడీల పాలన సాగుతోందని, తాను సిఎం అయితే మొక్కులు చెల్లిస్తానని పలు దేవుళ్లకు మొక్కుకున్న కెసిఆర్ సిఎం అయ్యాక తన పర్సనల్ డబ్బులతో మొక్కులు చెల్లించుకోకుండా.. ప్రజాధనంతో చెల్లించుకోవడం సిగ్గుచేటని టిపిసిసి అధికార ప్రతినిధి ప్యాట రమేష్ అన్నారు. దేవుళ్ల మొక్కుల పేరిట ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్‌లోని తన ఇంటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుళ్ల మొక్కులకు ప్రజాధనం ఉపయోగిస్తానని కెసిఆర్ ఎన్నికల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రకటించారా అని ప్రశ్నించారు. సొమ్ము ఒకరిది సోకు మరోకరిది అన్నట్టుగా సిఎం వైఖరి ఉందని ఏద్దేవా చేశారు. దీనిని ప్రశ్నిస్తే కాంగ్రెసోళ్లు సన్నాసులు అంటూ ప్రతివిమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో, ఆశతో పట్టం కట్టబెడితే, ఆ ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుడు ప్రకటనలు చేస్తూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. పెన్షన్లు మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు అతిగతీ లేదని, విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, రైతుల రుణాల మాఫీ జరగలేదని తెలిపారు. సిఎం కెసిఆర్ మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలు కట్టుకుంటూ, లగ్జరీ వాహనాల్లో తిరుగుతున్నారే తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిరుద్యోగుల తరపున పోరాటం సాగిస్తున్న టిజెఏసి చైర్మన్ కోదండరామ్‌పై పోలీసులతో దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ‘గడి’ల పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న సిఎం కెసిఆర్ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. లేకుంటే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని రమేష్ జోస్యం చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాదాసు శ్రీనివాస్, న్యాత శ్రీనివాస్, కటుకం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.