కరీంనగర్

మంత్రివర్గంలో దళితులకు స్థానమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, ఫిబ్రవరి 28: అధికారంలోకి రాగానే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన కెసిఆర్ .. దానిని విస్మరించారని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి నియోజకవర్గ కేం ద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో మండల అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కొత్తూరి మహేశ్ అధ్యక్షతన దళితుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అథిదిగా హాజరైన మంద కృష్ణ మాట్లాడుతు కెసిఆర్ అధికారంలోకి రాగానే వ్యవస్థను అంతా దొరల చేతిల్లోకి మార్చారని, ఎన్నికల్లో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలో రాగానే అధికార వ్యామోహాన్ని చాటారని విమర్శించారు. అలాగే కనీసం మంత్రి వర్గంలో దళితులకు జనాభా దామాశా ప్రకారం అవకాశం ఇవ్వలేదన్నారు. దళితులకు ఇచ్చిన భూములను టిఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని, ప్రపంచంలో బం గారం తర్వాత రెండో స్థానంలో చర్మ ఉత్పత్తులేనని అలాంటి చర్మ ఉత్పత్తి రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పా రు. రుక్మాపూర్‌కు మంజూరైన లెదర్‌పార్క్‌ను తరలించడం అన్యాయం అని, ఇక్కడి దళిత యువతపై దెబ్బ కొట్టడమేనని, బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి, ఎంపిలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నా రు. ఇతర కులాల చేతి వృత్తులను ఎలా పరిరక్షిస్తున్నారో అలాగే దళితులకు చర్మ ఉత్పత్తులను అలాగే రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. సదస్సులో వేరన్న, మ్యాక లక్ష్మన్, గజ్జెల సాయిలు, గొలిపల్లి మోహన్, రాజ య్య, కొత్తూరి మహేశ్, సముద్రాల అంజయ్య, నాగయ్య, రాజయ్య, శిశుకుమార్, కొమరయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.