కరీంనగర్

ప్రజల సంక్షేమమే టిఆర్‌ఎస్ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మార్చి 14: పేద ప్ర జల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవంక మండలాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల 11 వేల 500ల విలువైన చెక్కుల్ని ఆమె పం పిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, రమేష్, తహసీల్దార్లు, ఎంపిడివోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టిడిపి ధర్నా
* ఎమ్మెల్యేల అరెస్టుపై ఆగ్రహం
* కోర్టు సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో నినాదాలు

కరీంనగర్, మార్చి 14: టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీర య్య అరెస్ట్‌పై జిల్లా టిడిపి ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనినినిరసిస్తూ మంగళవారం కోర్టు సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా కన్వీనర్ క వ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న కెసిఆర్ నిరంకుశ, ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు కల్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివా స్, నాగుల బాలాగౌడ్, కొరటాల శివరామకృష్ణ, జాడి బాల్ రెడ్డి, వంచ శ్రీనివాస్ రెడ్డి, అనసూర్యానాయక్, దూలం రాధిక, పుట్ట నరేందర్, పులువురు కార్యకర్తలు పాల్గొన్నారు.