కరీంనగర్

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, మార్చి 21: రోజు రోజుకు పెరుగుతున్న విభిన్నంగా చేస్తున్న నేరాలను నియత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జగిత్యాల ఎస్పీ అనంతశర్మ అన్నారు. మంగళవారం జగిత్యాల మండలం చల్‌గల్ శివారులోని ప్రధాన రహదారిపై ఎస్పీ ఆకస్మికంగా కార్టెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రధానంగా ఇం టికి తాళాలు ఉన్నవాటినే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఇంటి యాజమానులు ఏమైన పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తే ఇంటి వద్ద భద్రత చర్యలు చేపడుతామని అన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దొంగతనాలను నియత్రించేందుకు అధికారులతో కలిసి సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఈమద్య జరిగిన దొంగతనాలకు సంబందించి 42 తులాల బంగారు ఆభరణాలను దొంగల నుండి రికవరి చేసినట్లు వెల్లడించారు. అనంతరం చల్‌గల్ ప్రధాన చౌరస్తాను పరిశీలించి నలువైపుల కెమెరాలను ఏర్పాటు చేయాలని రూరల్ సిఐ శ్రీనివాస్‌కు సూచించారు.
ఎస్సైలు కిరణ్‌కుమార్, నరేష్, రాజయ్య, ఎఎస్సై వేణు, సిబ్బంది పాల్గొన్నారు.