కరీంనగర్

‘అందరి సహకారంతోనే నేరాల అదుపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి21: శాంతి భ ద్రతల పరిరక్షణతోపాటు నేర ప్రవృత్తి గల వ్యక్తుల్లో మార్పు తీసుకు రావడమే ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ తెలిపారు. మంగళవారం ఎన్టీపీసీ ఇడిసి బిల్డింగ్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేర సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ విధానానికి శ్రీకారం చుట్టామని, ప్రయోగాత్మకంగా చేపడుతున్న క్రమంలో ఉన్న త విద్యావంతులు, సీనియర్ సిటిజన్స్, మహిళా సభ్యులు, టీచర్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా భాగస్వామ్యులు కావచ్చని, వారి వారి పేర్లను నమోదు చేసుకుంటే వారి పని విధానాన్ని బట్టి ఆయాశాఖలను అప్పగించి వారు కూడా యూనిఫారం లేని పోలీసు వలే వారితో సహకారాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ సైబర్ క్రైంను పూర్తిగా అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రౌడియిజం, మహిళలపై జరుగుతున్న వేధింపులు, బాలలపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే దిశగా సమీక్షలో సుధీర్ఘంగా చర్చించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 యా క్సిడెంట్ రెజల్యూషన్ టీంలు ఏర్పాటు చేయడంతో గత ఏడాదికి ఇప్పటి వరకు పోల్చుకుంటే చాలా వరకు రహదారులపై ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలిపారు. సమీక్షలో డిసిపిలు విజేందర్ రెడ్డి, జాన్ వెస్లి, ఎసిపిలు అపూర్వ రావు, సింధు శర్మ, కవిత, సుమతితోపాటు సి ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మైనార్టీ రెసిడెన్షియల్
పాఠశాలకు స్థలపరిశీలన
హుస్నాబాద్, మార్చి 21: సిద్దిపేట జిల్లాలో మెత్తం 6 మైనార్టి రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు అయినట్లు అందులో హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలో మైనార్టిరెసిడెన్సియల్ పాఠశాల ఎర్పాటకు సన్నాహలు చేస్తునట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ ఆర్‌డివొతో కలిసి పట్టణంలో కరీంనగర్ రోడ్డులోగల కవ్వ వెంకట్రాంరెడ్డ్భివనాన్ని పరిశీలించి చుట్టు పరిసరాలను పాఠశాలకు అవసరమైన స్థలం సేకరణ పై విచారణ చేశారు.్భవనం చుట్టున్న వ్యవసాయ భూమి యజమాని వివరాలు రెండు రోజుల్లో వివరాలను సేకరించి నివేదిక పంపాలని ఆర్‌డివోను ఆదేశించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్‌లో ఎర్పాటు చేసే మైనార్టి పాఠశాలలో 5,6,7, తరగతులకు గాను 240 సీట్లు ఉన్నాయని తెలిపారు. డివిజన్ స్థాయిలో ఏ మండలం వారైన దరఖాస్తులు ఈనెల 31 చేసుకోవాలని సూ చించారు. రెసిడెన్షియల్ పాఠశాలలోవిద్య బోధన ప్రయివేటు విద్యకు దీటైన బోధన విదానం,మంచి భోజనం, వసతుల కల్పన సౌకర్యలను ఎర్పటు చేస్తునట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డివొ శంకర్‌కుమార్ , మైనార్టిసంక్షేమ అధికారి జీవరత్నం, గిర్ధవార్ రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.