కరీంనగర్

రాష్ట్రాన్ని దోచుకుంటోంది టిఆర్‌ఎస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌టౌన్, మార్చి 21: కాంగ్రె స్ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలన కొనసాగిస్తోందని, అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ అందినకాడికి దోచుకుంటూ, ప్రతిపక్షాలపై బద్‌నాం రుద్దుతోందని జిల్లా కాంగ్రెస్ అధికారప్రతినిధి ఒంటెల రత్నాకర్ ఆరోపించారు. మంగళవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,కొత్త రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందని, పెరిగిన అప్పులతో రైతులు, కూలీలు, వ్యాపారుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హాయాంలో ఆరంభించిన సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాల్సిన ప్రభుత్వం కమీషన్ల కోసం రిడిజైనింగ్‌ల నాటకం ఆడిన విషయం బహిరంగమేనని అన్నారు. రాష్ట్ర సాధనలో మాజీ ఎంపి పొన్నం చేసిన కృషి మరువలేనిదని, దీనిని విస్మరించిన అధికారపార్టీ నాయకులు ఆయనను విమర్శించటం సిగ్గుచేటన్నారు. మేయర్ రవీందర్‌సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, మరోసారి కాంగ్రెస్‌ను విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. రాష్టన్రేత ప్యాట రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమానికొడిగడుతుందని, విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ సంస్థలకు ద్వారాలు తెరుస్తోందని దుయ్యబట్టారు. ఇందు కు నిదర్శనమే రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు భూములు కేటాయించే య త్నం చేయటమన్నారు. కులాల పేర ఓట్ల రాజకీయం చేస్తూ, మంత్రులను పాలేర్లుగా మార్చిన ఘనత కెసిఆర్ దేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం కాదు..శిథిలావస్థకు చేర్చుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హాయాంలో 1450 ఐటి సంస్థలకు రాష్ట్రంలో అవకాశమిస్తే, టిఆర్‌ఎస్ కేవలం 5 సంస్థలకు మాత్రమే అనుమతులిచ్చిందని విమర్శించారు. ప్రధాని పివి హాయాంలో దేశవ్యాప్తంగా 40లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించగా, రాష్ట్రంలో వైఎస్సార్ పాలనలో10లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దినసరి కూలీలు దివాలా తీస్తే, రైతుల రుణమాఫీ ఇప్పటికీ పూర్తిచేయకపోవటం దారుణమన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవటం వెనుక ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాసంక్షేమంపై దృష్టిసారించాలని, లేనిపక్షంలోతగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, చంద్రకాంత్, చిం తల కిషన్, బాసెట్టి కిషన్, జె.రమేశ్, ఎలగందుల మల్లేశం, సురేశ్,చెర్ల పద్మ, తాళ్ళపల్లి అంజయ్యగౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ
జగిత్యాల, మార్చి 21: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్యం తోడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జగిత్యాల ఇంచార్జ్ సబ్ కలెక్టర్ ముషారప్ అలీ అన్నారు. మంగళవారం జిల్లా ఆసుపత్రికి చేరుకున్న సబ్ కలెక్టర్ ముషారప్ అలీ ఆకస్మికంగా వార్డులో కలియ తిరిగారు. ఈ సందర్బంగా వార్డులో పరిశుభ్రతను పాటించాలని సూపరెండెంట్ అశోక్‌కుమార్‌కు సూచించారు. కాగా జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నియామకం కోసం ప్రకటన విడుదల చేయగా, తక్కువ గడువు, ప్రచారం లేకపోవడంతో సరైన దరఖాస్తులు అందక పోవడంతో నియమకంకు సంబంధించి వౌకిక పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. సబ్‌కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి సుగంధిణి, డిప్యూటి డిఎంహెచ్‌ఒ జైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అజాగ్రత్త వల్లే ప్రమాదాలు
* త్వరలోనే లైసెన్స్ మేళా ఏర్పాటు
* ప్రయాణికుల్లో నమ్మకం కలిగేలా డ్రైవింగ్
* ఆటోడ్రైవర్లకు సిపి కమలాసన్‌రెడ్డి ఉద్భోద

కరీంనగర్, మార్చి 21: వాహనాలను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కరీంనగర్ పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా మెదలడంతో పాటు అన్ని వర్గాల ప్రయాణీకుల్లో నమ్మకం కలిగేవిధంగా వాహనాలను నడుపాలని సూచించారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఆవరణలోని దివంగత జాన్‌విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ థియేటర్‌లో ఆటోడ్రైవర్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో సిపి మాట్లాడు తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ డిప్యూటి కమీషనర్ వినోద్‌కుమార్, ట్రాఫిక్ ఎసిపి అశోక్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు మహేష్, నారాయణ, ఆర్టీసి డివిజనల్ మేనేజర్ రవి, ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అనుమానితులపై
అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ టౌన్: నూతన వ్యక్తుల అనుమానాస్పద కదలికలు ఉన్నట్లయితే ప్రజలు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కోరారు. మంగళవారం కరీంనగర్ నగర శివారులోని విజయపురికాలనీలో పోలీసులు కా ర్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ ఎసిపి తిరుపతి, బాంబ్, డాగ్ స్వ్కాడ్‌సిబ్బంది పాల్గొన్నారు.
మ్యాక్స్‌సొసైటీలు ఏర్పాటు చేయాలి
* రాష్ట్ర జౌళిశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి
సిరిసిల్ల, మార్చి 21: సిరిసిల్ల పట్టణాన్ని ఒకే ప్రాంత పరిధిగా(యూనిట్) పరిగణించి నూతనంగా మ్యాక్స్ సొసైటీల ఏర్పాటుకు అవకాశం కల్పించాల ని స్థానిక మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం సిరిసిల్లలో మ్యాక్స్ సొసైటీల సమావేశంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌కు విజ్ఞప్తిచేశారు. అలాగే రాష్ట్ర ఐటి, చేనేత జౌళిశాఖ మంత్రి కె.తారకరామారావు, జిల్లా చేనేత జౌళి శాఖ ఎడిలకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సం దర్భంగా ఆడెపు రవీందర్ వివరాలను వెల్లడిస్తూ 38 వేల మరమగ్గాలు గల సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వం ద్వారా చేపట్టిన ఆర్‌విఎం గుడ్డ ఉత్పత్తిని పట్టణంలోని 54 మరమగ్గాల సహకార సంఘాలకు అప్పగిస్తున్నారని తెలిపారు. సంఘానికి 150 మరమగ్గాల చొప్పున లెక్కించిన ఎనిమిది వేల మరమగ్గాలు మాత్రమే ఆర్‌విఎం గుడ్డ ఉత్పత్తిని చేస్తున్నాయని, రాబో యే రోజుల్లో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ రంగ సంస్థలు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు అవసరమైన గుడ్డ ఉత్ప త్తి చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం ఇపుడున్న 54 సొసైటీల ద్వారా పెద్ద మొత్తంలో గుడ్డ ఉత్పత్తి చేయలేమని, సిరిసిల్ల పట్టణంలో 5 నుండి 10 జత లు కలిగిన చిన్న, మధ్య తరగతి ఆస్మా లు ఇంకా చాలామంది ఉన్నారన్నారు. ప్రస్తుతం టెక్స్‌టైల్ రంగం యారన్ ధరలు విపరీతరంగా పెరగడం వల్ల అమ్మకాలు లేక ఉత్పత్తి నిలిచిపోయి తీవ్రమైన సంక్షోభంలో ఉన్నదని, జా బ్‌వర్క్ లేక మరమగ్గాలు ఆగిపోయి ఆసాములు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి గడ్డు సమయంలో ఆర్‌విఎం లాంటి గుడ్డ ఉత్పత్తికి ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని రవీందర్ తెలిపారు.